బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రేమ కథలు!

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్‌ ఉన్నంత ఆసక్తిగా రెండో సీజన్‌ లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రేక్షకుల మదిలో స్థిరపడిపోయింది. ఎలాగైనా ఈ షోకు హైప్‌ పెంచాలని నిర్వాహకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రేమకథలను సృష్టించి ప్రచారం మొదలుపెట్టారు. ఇంట్లో ఉంటున్న తనిష్‌-సునయన; సామ్రాట్‌-తేజస్వీ మధ్య ఏదో నడుస్తున్నట్టు ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తించింది… ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు జంటల మధ్య ప్రేమ చిగురించినట్లు గతవారం ఇంట్లోని సభ్యులతో సూచనప్రాయంగా మాట్లాడించారు. శనివారం ఎపిషోడ్‌కు వచ్చిన హోస్ట్‌ నాని కూడా ఆ రెండు జంటలు ప్రేమలో ఉన్నాయన్న అనుమానం ప్రేక్షకులకు కలిగేలా మాట్లాడారు. తేజస్వినితో మాట్లాడుతున్నప్పుడు….ఇంకా…ఇంకా…ఇంకా…ఇంకా…అంటుంటే కెమెరా సామ్రాట్‌ను చూపించిది. సామ్రాట్‌తో మాట్లాడేటప్పుడు తేజస్వీని పదేపదే చూపించారు. తనిష్‌-సునయన విషయంలోనూ ఇలాగే చేశారు. నాని ఎంతగా ప్రయత్నించినా…ప్రేమ అనే మాటను ఆ నలుగురిలో ఒక్కరితోనూ చెప్పించలేకపోయారు. మొదటి సీజన్‌లోనూ చివరిదాకా ఇటువంటి ప్రేమకథనే ఒకటి ప్రచారం చూస్తూ ప్రేక్షకులను రంజింపచేశారు. ఈసారి రెండు జంటలకు ప్రేమ ముద్ర వేసి…షోను ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి జంటలు చివరిదాకా షోలో ఉంటాయనడంలో సందేహం లేదు.

ఇదిలావుండగా శనివారం నాటి ఎపిషోడ్‌లో డప్పుతో దండోరా వేస్తూ ఒక ఇంటి సభ్యుని గుణగణాలు చెప్పే కాన్పెప్ట్‌ తీసుకున్నారు. రక్తికట్టించడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్‌ అయినప్పటికీ….ఏ ఒక్కరూ సరిగా చేయలేకపోయారు. దండోరా వేయమంటే… ఒకరు హరికథ రీతిలో చెబితే, ఇంకొకరు సోది రూపంలో చెప్పారు. ఏ కళారూపాన్నీ ఆకట్టుకునేలా ప్రదర్శించలేకపోయారు. గత సీజన్‌లో హరితేజ హరికథను ఇరగదీసిన సంగతి తెలిసిందే. అటువంటిది కంటెంట్‌ తీసుకురావాలని ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుంది.

బాబు గోగినేని ముందు నాని ఈ వారం కూడా తలవాలేశారు. చెరకు రసం టాస్క్‌లో నీళ్లు కలపడంపై గోగినేని ప్రశ్నించారు నాని. ‘మీరు అన్నీ పద్ధతిగా జరగాలని, నిజాయితీగా ఉండాలని భావిస్తారు. అలాంటిది చెరకు రసంలో నీళ్లు కలిపి గెలవాలని ఎలా అనుకున్నారు’ అని నిలదీస్తున్నట్లు ప్రశ్నించిన నానీకీ, బిగ్‌బాస్‌కు గట్ట సమాధానమే ఇచ్చారు. ‘మీరు ఇచ్చిన టాస్కే అటువంటి వాటికి ఆస్కారం కలిగించేలా ఉంది. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి టాస్క్‌ గెలవమన్నారు. అదిగాక ఎదుటి వాళ్ల నుంచి చెరుకు గడలు లాక్కోమన్నారు. స్టిక్టర్లు లాక్కోమన్నారు. నీళ్లు కలపడమూ అటువంటిదే. నీను నీళ్లు తెచ్చిపోసినా ఇక్కడ ఎవరూ గుర్తించలేకపోయారు. ఇది తొండి గేం. నిబంధనలే తొండిగా ఉన్నాయి’ అని చెప్పేసరికి నానీ ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంకో విషయం….తన మిత్రుడైన తనిష్‌ పట్ల కాస్త పక్షపాతం చూపుతున్నారని బయట చెబుకుంటున్న మాటలు నాని చెవికి చేరినట్లున్నాయి. ‘నేను నీతో కాస్త సాఫ్ట్‌గా ఉంటున్నానని బయట చెప్పుకుంటున్నారు…అవకాశం ఇచ్చినపుడు నిన్నూ కడిగేస్తా’ అని తనిష్‌తో చెప్పారు నాని. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విషయంలో ఇటువంటి విమర్శలు ఎన్నడూ రాలేదు. శనివారం నాటి ఎపిషోడ్‌ ఫర్వాలేదనిపించింది. ఆదివారం మూడో ఎలిమినేషన్‌ జరగనుంది. సామాన్యులను బయటకు పంపేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ షోలో ఆ కేటగిరీలో మిగిలింది గణేష్‌. అయితే ఈవారం గణేష్‌ను ఎలిమినేట్‌ చేయకపోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*