బిగ్‌బాస్‌ ఉత్తర కొరియా నియంత..!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 ఆదివారం (30.09.2018)న ముగియనుంది. వితేతను ప్రకటించనున్నారు. దీనికి ఒక రోజు ముందు అంటే శనివారం నాటి ఎపిషోడ్‌లో బిగ్‌బాస్‌ను ఉత్తర కొరియా నియంత అని అభివర్ణించారు ఒక హౌజ్‌మేట్‌. ఈ మాట అనే ధైర్యం ఎవరికి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకెవరు….’బిగ్‌బాస్‌ ఒకసారి ఎదురుగా వచ్చి కనిపించి….నీ సంగతి చెబుతాను’ అంటూ మొదట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు గోగినేనే.

పాత హౌజ్‌మేట్స్‌ అందరినీ బాగ్‌బాస్‌ ఇంట్లోకి పిలిచారు. నూతన్‌ నాయుడు మినహా అందరూ వచ్చిన సంగతి తెలిసిందే. అందరూ ఆలింగనాలు చేసుకుని భావోద్వేగాలను పంచుకున్నారు. కలిసి భోజనాలు చేశారు. జోకులు వేసుకున్నారు. శనివారం నాటి ఎపిషోడ్‌లో 17 మంది హౌజ్‌మేట్స్‌తో ఓ సరదా కార్యక్రమం నిర్వహించారు బిగ్‌బాస్‌. అందరూ ఆపీ ఫేజ్‌ డ్రింకు సేవిస్తూ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా రోల్‌రైడా, అమిత్‌ తివారా యాంకర్లుగా మారి సరదాగా సందడి చేశారు.

ఈ ఇద్దరూ…మిగతా ఇంటి సభ్యులను రాఫిడ్‌ ఫైర్‌ పేరుతో ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి’ అని బాబు గోగినేనిని అడిగారు. దీనిపై స్పందించిన బాబు…’ఉత్తర కొరియా నియంత’ అని చెప్పారు. ఎందుకలా అంటున్నారనేదానికి వివరణ ఇస్తూ…’తన ఇష్టానుసారంగా ఏదిబడితే అది చెబుతారు. చేయమంటారు….అందుకే ఆయన నియంత’ అని బిగ్‌బాస్‌కు చివర్లోనూ చురకులు అంటించారు గోగినేని.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*