బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఫుల్‌ జోష్‌!

బిగ్‌బాస్‌ తెలుగు-2 ఫైనల్స్‌కు ఒకరోజు మిగిలివుండగా….ఇల్లు ఫుల్‌ జోష్‌తో ఆనందంలో మునిగిపోయింది. ఫైనల్స్‌లో ఉన్న ఐదుగురు సభ్యులతో పాటు…ఎలిమినేటయి వెళ్లిపోయిన సభ్యులు కూడా ఇంట్లోకి రావడంతో సందడి నెలకొంది. ఇంటి సభ్యులనే కాదు ప్రేక్షకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ పాత సభ్యులంతా హౌజ్‌లోకి ప్రవేశించారు. ఫైనల్స్‌లో ఉన్న ఐదురుగు సభ్యుల జర్నీ ఏవిలనూ చూపించి, వారిలోని ఫ్లస్‌ పాయింట్ల గురించి బిగ్‌బాస్‌ చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముగిసిన వెంటనే పాత సభ్యుల ప్రవేశం మొదలయింది.

శుక్రవారం నాటి ఎపిషోడ్‌లో నూతన్‌ నాయుడు మినహా పాత సభ్యులంతా ఇంటిలోకి వచ్చారు. సంజన, కిరీటి, నందిని, తేజశ్వని, దీప్తి సునయన, శ్యామల, బాబు గోగినేని, పూజ రామచంద్రన్‌, గణేష్‌, అమిత్‌, రోల్‌రైడా అందరూ దఫదఫాలుగా ఇంట్లోకి వచ్చారు. పాత సభ్యులనంతా చూడగానే…లోపలన్ను వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. భావోద్వేగాలను పంచుకున్నారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఉదయం నుంచి రాత్రి దాకా పాత సభ్యులంతా ఇంటిలోనే ఉన్నారు.

ఇంటి బయట ఏమి జరుగుతోందో తెలుసుకోడానికి ఫైనల్స్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ప్రయత్నించారు. అయితే…బయటి నుంచి వచ్చిన వారు పరిమితమైన సమాచారమే వారికి చెప్పారు. ఏమైనా బిగ్‌బాస్‌ షో ముగింపును బాగా రక్తికట్టిస్తున్నారు. గొడవలు తగ్గించి బంధాలు, ప్రేమానురాగాలతో ప్రేక్షకుల్లోనూ భావోద్వేగాలను రగిల్చుతూ షోపైన మంచి అనుభూతిని మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్‌బాస్‌. ఈ షో ఫైనల్‌ ఎపిషోడ్‌ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*