బిగ్ బాస్ : ఆ ట్విస్ట్…ప్రేక్షకులు ఊహించిందే..!

బిగ్ బాస్ ప్రేక్షకులు…ఆ బిగ్ బాస్ నే మించిపోతున్నారు. ట్విస్ట్ లతో ప్రేక్షకులను‌ ఆశ్చర్యానికి గురిచేద్దామని బిగ్ బాస్ అనుకుంటే…ఆ బాస్ కే షాక్ ఇస్తున్నారు ప్రేక్షకులు. జరగబోయేదాన్ని ముందే ఊహించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని శనివారం రాత్రి నాగార్జున ప్రకటించారు.‌ అదే రోజు కరాటే కల్యాణి ఎలిమినేషన్ ప్రకటించారు. రెండో రోజు ఆదివారం నాడు చివరిదాకా సస్పెన్స్ కొనసాగించి…, ఒకొక్కరినే సేవ్ చేశారు. చివర్లో హారిక, మోనాల్ మిగిలారు. ఇద్దరులో ఒకరి ఎలిమినేషన్ అనివార్యమని నాగార్జున చెప్పారు. ఆఖరికి చిన్న తతంగం అనంతరం హారిక ఎలిమినేట్ అయినట్లు తేల్చారు. దీంతో హౌజ్ సభ్యులంతా ఏడ్చారు. ఆమెను సాగనంపడానికి గేటు వద్దకు వచ్చారు. ఆఖరి నిమిషంలో ఇది ఫేక్ ఎలిమినేషన్ అని హోస్ట్ ప్రకటించి, హారికను ఇంట్లోనే ఉంచారు.

ఈ తతంగమంతా ఇంట్లో ఉన్నవారికి అర్థం కాకపోవచ్చుగానీ…ప్రేక్షకులు ముందే ఊహించారు. హారిక, మోనాల్ లో ఎవరు బయటకు వెళ్లినా…ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తారని అంచనా వేశారు. ప్రోమోతోనే దీన్ని ఊహించారు. షో ఇప్పుడున్న‌ దశలో హారిక గానీ, మోనాల్ గానీ బయటకు వెళ్లే‌ అవకాశం లేదని షోని ఫాలో‌ అయ్యేవారికి ఇట్టే అర్థమైపోతుంది. అందుకే హారిక ట్విస్ట్ ను‌ ప్రేక్షకులు ముందే ఊహించగలిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*