బిగ్ బాస్ ఇంటిలో చోరీలకు పాల్పడిన గీతా మాధురి!

బిగ్ బాస్ ఇంటిలో 25, 25 రోజులు ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఇంటిలోని ప్రతి సభ్యునికి చెందిన ఏదో ఒక వస్తువు దొంగిలించి ఇంటిలోని పోస్టు బాక్సులో వేయాలని బాస్ ఆదేశించారు. ఆ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసింది. రెండో రోజు ఉదయం దాకా సమయం ఇచ్చినా రాత్రికే టాస్క్ పూర్తిచేశారు గీత. రెండో రోజు ఉదయం స్నానం చేసిన తరువాత సామ్రాట్ తన చొక్కా కోసం ఇల్లంతా వెతికారు. ఇంతలో బిగ్ బాస్ ఓ ప్రకటన చేశారు. ఇంటిలో దొంగ ఉన్నారని, ఇప్పటికే కొన్ని వస్తువులు చోరీ అయ్యాయని, ఇంతకీ ఆ దొంగ ఎవరో తెలుసుకోండని చెప్పారు. గీతా మాధరిని ఎవరూ అనుమానించలేదు. బాబు గోగినేని మాత్రం తనకు గీత మాధురిపైనే అనుమానంగా ఉందని చెప్పారు.‌ ముందురోజు రాత్రి గీతా మాధురి అనుమాస్పద ప్రవర్తనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. దొంగ ఎవరో గుర్తించేందుకు మిగతా సభ్యులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. రేపటి ఎపిషోడ్ లో దొంగ ఎవరో బిగ్ బాసే చెప్పవచ్చు.

ఇక ఐదో వారానికి సంబంధించి కెప్టెన్ ఎంపిక జరిగింది. కొందర్ని రౌడీలు బంధించడం, హీరోలు విడిపించడం అనే టాస్క్ ద్వారా కౌసల్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇదిలావుండగా లగ్జరీ బడ్జెట్ కోసం రెండు రోజులు సాగిన లవర్స్ టాస్క్ ముగిసింది. అయితే ఆ టాస్క్ కు మధ్య మధ్యలో విరామం ఇచ్చారంటూ బిగ్ బాస్ తప్పు పట్టారు. లగ్జరీ బడ్జెట్ లో పూర్తిగా కోత పెట్టారు.

ఇక శని, ఆదివారాలు వస్తుండటంతో ఇంటిలో ఎలిమినేషన్ టెన్షన్‌ మొదలయింది. నందిని, దీప్తి, గణేష్, కౌసల్, గీత మాధురి, గోగినేని బాబు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ పై నందిని, దీప్తి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఏమి జరుగుతుందో ఆదివారం తెలుస్తుంది. ఇంకో విషయం 100 రోజుల షోలో 25 రోజులు పూర్తయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*