బిగ్ బాస్ ఇంటి సభ్యులకు జైలు భయం!

బిగ్ బాస్ రెండో సీజన్ మొదటిరోజు గడిచింది. ఇంటిలోని సభ్యుల్లో జైలు భయం కనిపిస్తోంది. మొదటి సీజన్లో లేని జైలు కాన్సెప్ట్ ను ఈ సీజన్లో పెట్టారు. ఇంటి ఆవరణలోనే బయట జైలు ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ హౌజే ఒక జైలుకాగా దానిలోపల ఇంకో జైలు పెట్టారు. ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజే ఇద్దరు సభ్యులను జైల్లో పెట్టారు. సభ్యులందరి అభిప్రాయం తీసుకుని నూతన్ నాయుడు, సంజనలను జై లోకి పంపారు. సభ్యులందరూ ఒకచోట ఉంటే ఆ ఇద్దరు మాత్రం జైల్లో గడిపారు. రెండో రోజు సాయంత్రానికి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుని నూతన నాయుడును జైలు నుంచి విడుదల చేశారు. సంజన ఇంకో రోజు కూడా లోపలే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఈ జైల్లో ఫ్యాను, ఏసి వంటివి ఏవీ లేవు. దోమలు కూడా ఉన్నాయని సంజన ఆవేదన చెందుతోంది. ఇదంతా చూసిన తర్వాత ఒకరోజు జైలు తప్పదు ఏమన్నా భయం సభ్యుల్లో కనిపిస్తోంది.

ఇక ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఓటింగ్ జరిగింది. ఇందులో సునయనను బయటకు పంపడానికి ఎక్కువ మంది ఓటు వేశారు. అదేవిధంగా గణేష్ కూడా నామినేట్ అయ్యారు. తొలిరోజు తనిష్క్ కు అప్పగించిన ట్రాస్క్ విచిత్రంగా ఉంది. స్విమ్మింగ్ పూల్ లోని నీటిని చిన్న‌ స్పూన్తో తోడి బక్కెట్లో నింపే టాస్క్ ఇచ్చారు. తనుష్ గంటల తరబడి స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చుని పెద్ద మార్కెట్ కు మూడు వంతుల భాగం వరకు నీటిని నింపారు.

బాబు గోగినేని ఇద్దరు ఇంటి సభ్యులతో మాట్లాడుతూ తానర బిగ్గర్ బ్రదర్ అని చెప్పుకున్నారు. దానికి ఆ సభ్యులు మీరు బిగ్ బాస్ కే బిగ్గర్ బ్రదరా…అని అడగారు. మీరు ఎలాగైనా అన్వయించుకోండి అని గోగినేని చెప్పారు. ఇదిలా ఉండగా మొదటి సీజన్ నుంచే బిగ్ బాస్ వాయిస్ గురించి చాలా పెద్ద ఆసక్తికర చర్చ జరిగింది. గొంతు చాలా గంభీరంగా ఉందని అభిప్రాయపడ్డారు. బాబు గోగినేని మాత్రం ఆ గొంతు చాలా సాంకేతికంగా ఉందని కామెంట్ చేశారు. తొలిరోజు ఇంతకుమించిన విశేషాలు ఏమీ లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*