బిగ్ బాస్ ఇంట్లోకి తెలుగురాని ఇంకో నటి!

తన ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడాలని‌ బిగ్ బాస్ చెబుతుంటారు. ‌బిగ్ బాస్ ఇంట్లో ఉండటానికి అదే తొలి‌ నిబంధన‌ అంటారు. ఎవరైనా ఇంటి సభ్యులు ఇంగ్లీష్ మాట్టాడితే శిక్షిస్తుంటారు. గెస్ట్ గా వచ్చిన మంచు లక్ష్మి వంటివాళ్లు ఇంగ్లీష్ మాట్లాడినా…బిగ్ బాస్ ఇంట్లో మీరు తెలుగులోనే మాట్లటడాలి… అంటూ గంభిరంగా హెచ్చరిస్తారు బాస్. అయితే ఆయనే తెలుగు రాని వాళ్లను ఇంటి సభ్యులు గా ఎంపిక చేస్తున్నారు.

తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇంటిలోకి వచ్చిన స్వామి రారా ఫేం పూజా రామచంద్రన్ కు తెలుగు అసలు రావడం లేదు. ఇది బిగ్ బాస్ షో ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తోంది. ఇప్పటికే నందిని మాట్లాడే ఇంగ్లీషుతో ఇబ్బందిగా ఉంది. ఇక పూజ ఇంగ్లీషును భరించక తప్పదు. తెలుగు షోకు…అసలు తెలుగురాని వాళ్లను ఎలా ఎంపిక చేస్తారో అర్థం కాదు.

ఇదిలావుండగా….44 వ రోజు ఇంటిలో టెలిఫోన్ ఏర్పాటయ చేశారు. ఇంటిలో ఉన్నవారికి బంధువుల నుంచి ఫోన్ వస్తుంది. ‌ఫోన్ చేసిన వ్యక్తి తాను ఎవరి కోసం చేశామో నేరుగా పేరు చెప్పకూడదు. హంట్ చెబితే…దాని ఆధారంగా వచ్చిన ఫోన్ ఎవరికో తెలుసుకుని ఫోన్ ఇవ్వాలి. తెలుసుకోకపోతే కాల్ కట్ అవుతుంది. ఒక వేళ ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు చెప్పినా, ఎవరి కోసం ఫోన్ చేశారో చెప్పినా వెంటనే కాల్ కట్ అవుతుంది.

మొదటి కాల్ కౌశల్ కోసం వచ్చింది. గీత తీశారు. అవతలి వైపు వ్యక్తి చెప్పిన వివరాలతో ఆ కాల్ కౌశల్ కోసమే అని గుర్తించి ఫోన్ ఆయనకు అందించారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడారు కౌశల్.

కాల్ సునయన కోసం వచ్చంది. రోల్ తీశారు. ఫోన్ చేసిన సునయన తండ్రి తన పేరు‌ చెప్పడంతో కాల్ కట్టయింది.‌ దీంతో సునయనకు తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం చేజారిపోయింది.

మూడో కాల్ రోల్ రైడాకు వచ్చింది. కౌశల్ తీసి, సరిగానే గుర్తించి రోల్ కు ఇచ్చారు. నాలుగో కాల్ సామ్రాట్ కు వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకెళ్లావో గుర్తుంచుని ఆడాలని, ఒకరితోనే ఎక్కవగా ఉండటం వల్ల చెడ్డ పేరు వచ్చిందని చెబుతూ… తేజస్వితో సామ్రాట్ స్నేహాన్ని గుర్తు చేశారు అతని‌ తల్లి. మిగిలిన సభ్యులకు 45వ రోజు కాల్స్ రానున్నాయి.‌

బిగ్ బాస్ మొదటి సీజన్ లొనూ టెలిఫోన్ సంభాషణ అవకాశాన్ని కల్పించారు. అప్పుడు ఆ ఎపిషోడ్ చాలా ఉద్వేగభరి తంగా సాగింది. ప్రస్తుతం అంత ఎమోషన్ కనిపించలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*