బిగ్ బాస్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి..!

బిగ్ బాస్ ఇల్లు అంటేనే గొడవలు గుర్తుకొస్తాయి. ఆ ఇంట్లో టివి ఉండదు. సెల్ ఫోన్ ఉండదు. పేపర్ ఉండదు. పగటి పూట నిద్రపోడాని వీల్లేదు. ఎంత సేపయినా ఇంట్లోని వారితో మాట్లాడుకోవాలి. మాటలు తప్ప వేరే టైంపాస్ ఉండదు. మాటలు ఎక్కువై గొడవలకు దారితీస్తుంటాయి. బిగ్ బాస్ ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తాడో తెలియదు. అప్పటి దాకా క్లోజ్ గా ఉన్నవారితోనే గొడవపడాల్సి రావచ్చు. బిగ్ నాస్ ఇచ్చే టాస్క్ లు ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టేలా ఉంటాయి.

బిగ్బబాస్ సీజన్ 2లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రెండోరోజు టాస్క్ లో భాగంగా సభ్యులను రెండు టీంలుగా విభజించారు. ఒక టీం యజమానులైతే ఇంకో టీం సేవకులు. ఈ సేవకులతో యజమానులు ఏ పనులైనా ఎలాంటి పనులైనా చేయించుకోవచ్చు. అయితే…సేవకుల టీంలో ఉన్న బాబు గోగినేని యజమానులు చెప్పిన పనులు చేయడానికి ఎదురుతిరిగారు. సేవకులకూ హక్కులుంటాయని వాదించారు. ఈ టాస్క్ సందర్భంగా సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. మొదటి బిగ్ బాస్ లో ఇలాంటి సీన్ రావడానికి వారానికి పైగా పట్టింది. ఈ‌సీజన్లో రెండో రోజుకే గొడవల సీన్ వచ్చేసింది. టాస్క్ లో యజమానుల నుండి బాబు గోగినేనికి అన్నీ అన్ లైక్ లే వచ్చాయి. ఒక లైక్ కూడా రాలేదు. దీని పర్యావసానం ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందేనని బిగ్ బాస్ చెప్పారు.

ఇదిలా ఉండగా బాబు గోగినేని తన తెలివితేటలను ఉపయోగించి … గడియారం లేకుండానే సమయం చెప్పారు. ఒక రాడ్ ను ఆరుబయట ఎండలో నిలబెట్టి, దాని నీడ ఆధారంగా సమయం 3 గంటలు అయివుంటుందని చెప్పారు. టివిలో చూపించినదాన్ని బట్టి ఆయన చెప్పిన‌ సమయం కరెక్టే అని తేలింది. దీంతో రాబోయే కాలంలో‌ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కాస్త ఆరుబయలు కూడా లేకుండా కప్పు మూసేస్తారేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*