బిగ్ బాస్ ఇంట్లో అప్పుడే కన్నీళ్లు..!

బిగ్ బాస్ షో అంటేనే భావోద్వేగాపతో ఆడుకునే ఓ ఆట. వంద రోజుల పాటు కుటుంబ సభ్యులను విడిచిపెట్డి ఉండడమంటే మాటలు కాదు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే మొదటి బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్ బాబు వారం రోజులు కూడా బిగ్ బాస్ ఇంట్లో ఉండలేక పోయారు. రెండో సీజన్ లో మూడో రోజే కిరీటి అనీ ఇంటి సభ్యునికి ఇల్లు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను తాను సముదాయించుకున్నారు. రోల్ రైనా కూడా అతనికి‌ ధైర్యం చెప్పారు. ఇంకో నాలుగు రోజులు గడిస్తే ఇంకెవరెవరు కన్నీళ్లు పెట్టుకుంటారో తెలుస్తుంది. సాధారణంగా బలహీన మనస్కులు భావోద్వేగాలను దాచుకోలేరు. అలాంటి వారిలో కిరీటి ప్రథముడిగా కనిపిస్తున్నారు. అందరి కంటే వయసులో చిన్నదయిన సునయన కూడా ఇంటిపై బెంగ కనిపించలేదు.

ఇదిలావుండగా షో మూడోరోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదే అభిప్రాయం బిగ్ బాస్ కు కలిగినట్లుంది. అందుకే తనిష్ ని పిలిచి మీ ప్రదర్శనపై సంతృప్తి గా ఉన్నారా…అని ప్రశ్నించారు. ప్రత్యేకించి తనిష్ నుంచి ఆశించిన స్టఫ్ రాలేదన్న భావన కూడా బాస్ కు ఉన్నట్లుంది. ఇది అర్థమయిందో‌ లేదోగానీ తనిష్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.

బాబు గోగినేని మూడో రోజు కూడా ఒక టాస్క్ ను చేయడానికి నిరాకరించారు. దీంతో…సభ్యల్లోనే ఒక చర్చ జరిగింది. ఆయన్ను షో నిర్వాహకులే ఆహ్వానించారు కాబట్టి తనను అంత తేలిగ్గా బయటకు పంపలేరన్న ధీమా బాబు గోగినేనిలో ఉందంటూ ముగ్గురు సభ్యులు చాలా చర్చించుకున్నారు.

ఇంటిలో ఏదైనా జరగవచ్చని రెండో రోజు బిగ్ బాస్ చెప్పారు. దీనికి అనుగుణంగా యజమానులు..సేవకుల గేమ్ లో మూడోరోజు పాత్రలు తారుమారయ్యాయి. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ సాగదీస్తున్నట్లు అనిపిస్తోంది. ఆడవాళ్లు మగవాళ్ల లాగా, మగవాళ్లు ఆడవాళ్లు లాగా నటించిన సన్నివేశం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి సీజన్ లో హరితేజ చెప్పిన బిగ్ బాస్ హరికథ ఆ సీజన్ కే హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆసక్తి పెంచటానికి బిస్ బాస్ ఏమి చేస్తారో చూడాలి. ఇదేవిధంగస కొనసాగితే జనం టివిలు కట్టేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*