బిగ్ బాస్ క్రూరత్వం…ఇంటి సభ్యుల కాట్లాట!

బిగ్ బాస్ లోని క్రూరత్వం మెల్లగా బయటపడుతోంది. షో ఆకట్టుకోవడం లేదన్న‌ అభిప్రాయం సర్వత్రా ప్రబలుతున్న తరుణంలో…ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఈ ప్రభావంతో ఇంటి సభ్యులు కుక్కల్లా కాట్లటడుకోవడం మొదలు పెట్టారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకుండా చేశారు. సభ్యులు రెండు గ్రూపులుగా విడుపోయి ప్రతి చిన్న విషయానికీ దూషించుకుంటున్నారు. తిండి కోసం కూడా కొట్లాడుకునే పరిస్థితిని బిగ్ బాస్ సృష్టించారు. సామ్రాట్…నూతన్ నాయుడు, తనిష్…నూతన్ నాయుడు, కౌసల్…కిరీటి ఇలా ఒకరినొకరు కొట్టుకునేంతగా గొడవపడ్డారు. చిన్నచిన్న వాన చినుకులు పెను తుఫానులా మారాయి…ఏమైనా జరగొచ్చు…చూస్తూనే ఉండండి…బిగ్ బాస్ అంటూ శుక్రవారం నాటి ఎపిషోడ్ ను ముగించారు.

సరైన తిండిలేకుండా చేస్తే కడుపు మండి అసహనానికి గురయి గొడవలకు దిగుతారన్నది బిగ్ బాస్ సూత్రం. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారు. గత ఆదివారం ఎపిషోడ్ లో నాని తిండి గురించే వ్యాఖ్యలు చేశారు. కడుపు నిండా తిండి ఉంటే బాగానే ఉంటుంది. ఏమైనా జరగొచ్చు…అంటూ ముగించారు. దాని అర్థం ఏమిటో ఈ వారం బయటపడింది. కలిసి మెలసి ఉన్న సభ్యులు కొట్లాడుకునేలా చేసారు. ఒక్కరికీ ఆ ఇంట్లో ఉండాలన్న కోరిక లేని వాతావరణం సృష్టించారు. షోని రక్తి కట్టించడం కోసం బిగ్ బాస్ దేనికైనా తెగిస్తారని తాజా ఎపిషోడ్స్ రుజువుచేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*