బిగ్ బాస్ మరో మోసం!

షోను రక్తి కట్టించడానికి బిగ్ బాస్ ఏది చేయడానికైనా వెనుకాడరు. మోసం చేయడానికైనా, మాట తప్పడానిమైనా బాస్ సిద్దం. సర్ ప్రైజ్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఆ ఆసక్తి కోసం మాట తప్పి శ్యామలను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఎవరికైతే తక్కువ ఓట్ల వస్తాయో వాళ్లు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెబుతుంటారు. అయితే నాలుగోవారం ఎలిమినేషన్లో దీన్ని పాటించలేదు. ఇంతకీ విషయం ఏమంటే…ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నవారిలో సేఫ్ జోన్ లోకి వెళ్లినవారు తరువాత…దీప్తి, నందిని, శ్యామల మిగిలారు. ఈ ముగ్గురినీ యాక్టవిటీ ఏరియాకి పిలిచారు. బిగ్ బాస్ నేరుగా వాళ్లతో మాట్లాడారు. ఆ తర్వాత కౌశల్, తేజస్వీ లనూ యాక్టివిటీ ఏరియాకు రమ్మన్నారు.

ఎలిమినేషన్ కు సిద్ధంగా ఉన్న ముగ్గురిలో కౌశల్, తేజస్వినీ ఒకొక్కరు ఒకొక్కరిని సేవ్ చేయవచ్చని చెప్పారు. దీంతో నందినిని కౌశల్, దీప్తిని తేజస్విని సేవ్ చేశారు. ఇక్కడ మోసం, అన్యాయం ఏమంటే…ఆ ముగ్గురిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పివుంటే…ధర్మంగా ఎవరిని సేవ్ చేయాలో కౌశల్, తేజస్వి నిర్ణయిం చుకుని వుండేవాళ్లు. అలా చెప్పకపోవడం వల్ల ఎవరో ఒకరు అన్నట్లు సేవ్ చేశారు. శ్యామలకు అన్యాయం జరిగిపోయింది. అయినా ఒకరినే బయటకు పంపాలను కున్నప్పుడు ఓట్ల ఆధారంగా పంపివుండొచ్చు. ఒక వేళ షో సంప్రదా యానికి భిన్నంగా ఒకరిని మించి బయటకు పంపాలనున్నపుడు ప్రత్యేక ఓటింగ్ ప్రక్రియను వాడుకుని ఉండొచ్చు. ఏమైనా బిగ్ బాస్ షోలో ఏదైనా జరగవచ్చు అని పదేపదే చెబుతున్నారు కాబట్టి ఇదీ అలాంటిదేనని సరిపెట్టుకోవాలి.

ఇక శ్యామల ఇంటి నుంచి వెళ్లిపోయే టప్పుడు దీప్తి వెక్కివెక్కి ఏడ్చింది. శ్యామల కూడా అంతే ఏడ్చింది. ఇంటిలోని మిగతా సభ్యులూ దుఃఖం లో మునిగి పోయారు. ఈ వారమంతా అందరి బట్టలు ఉతకాలి అనే బిగ్ బాంబును తన స్నేహితురాలైన దీప్తిపైనే వేశారు శ్యామల. అంతకు మునుపు ఇంటిలో తాము ఎవరిని విలన్ గా భావిస్తున్నారో వారిని విలన్ కుర్చీలో కూర్చోబెట్టి కిరీటం పెట్టే ఆటను ఆడించారు నాని. మొదటి సీజన్ లోనూ ఇటువంట ఆట ఆడించారు. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు.

ఇక ఆదివారం ఎపిషోడ్ లో ఒక ఎబ్బెట్టు చర్చ ఒకటి సాగింది. ఒక సభ్యురాలు రాత్రివేళ తన బెడ్ పైన కనిపించడం లేదని, ఆమె పురుషుల బెడ్ లో ఉంటుందనేది ఆ చర్చ. ( ఎబ్బెట్టు చర్చగా భావిస్తున్నందున వారి పేర్లు రాయడం లేదు). దీన్ని గమనించి ఎవరితోనో కౌశల్ చర్చించారంటూ ఇద్దరు సభ్యులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దీన్ని చూపించకుండా ఉండొచ్చు. బిగ్ బాస్ కు కావాల్సింది ఇటువంటి మసాలానే కాబట్టి హాట్ హాట్ చర్చ జరిగేలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఇంటిలో ఏదైనా చూడాల్సిరావొచ్చు. ఎందుకంటే అది బిగ్ బాస్ ఇల్లు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*