బిగ్ బాస్ ఎట్టకేలకు రక్తికట్టించారు!

బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవడం లేదని వస్తున్న విమర్శలకు జవాబు చెప్పారా అనేవిధంగా ఒక్కసారి గా షోను రంజుగా మార్చేశారు. ప్రేమ అపోహలు సృష్టించి, దానిచుట్టూనే కథ నడిపిస్తూ సభ్యుల మధ్యలో విభేదాలు రేపి, షోను రసకందాయంలో పడేశారు. సామ్రాట్..తేజశ్వి, తనిష్…సునయన మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ఒక అభిప్రాయం కలిగేలే చేసిన బిగ్ బాస్…దాన్ని షోకు బాగా వాడుకుంటున్నారు. ఆదివారం దాకా పరోక్షంగా మాత్రమే మాట్లాడుకుంటున్న ఈ విషయం సోమవారం నుంచి బహిరంగా అందరూ మాట్లాడుకునే అంశంగా మారింది. ఇంటిలోని గీత, శ్యామల, నందిని, దీప్తి…తదితరులు తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని తేజశ్వి ఆవేదనతో ఉండగా….బిగ్ బాస్ తనిష్, హమిద్ లను సీక్రెట్ రూంకి పిలిచి రహస్య టాస్క్ ఇచ్చారు. ఏదైనా కట్టుకథ సృష్టించి సభ్యులందరినీ నమ్మిస్తే అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దీంతో ప్రేమ వ్యవహారాన్నే తీసుకుని టాస్క్ నడిపిస్తున్నారు ఆ ఇద్దరు. సునయనతో తనకు ప్రేమ ఉన్నట్లు ఇంటి సభ్యులు మాట్లాడుకుంటున్న వీడియోలను బిగ్ బాస్ చూపించారని, అలా తప్పుగా ఎందుకు మాట్లాడతారని బాధ నటిస్తూ తనిష్ అందరినీ నమ్మిస్తున్నారు. తాము మాట్లాడుకున్నది నిజమే కదా…ఆ వీడియోలు చూపించివుంటారన్న ఆందోళనతో కొందరు బయట పడిపోయారు. తాము మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నట్లు సమర్థించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ఇప్పటిదాకా ప్రసారమైన ఎపిషోడ్ లలో ఇదే బెటర్ అని చెప్పాలి. రహస్య టాస్క్ బాగా చేస్తున్నందుకు అభినందించి తనిష్, హమిద్ లకు కేకులు పెట్టారు బిగ్ బాస్. ఇదిలావుండగా నాలుగో వారానికి ఎలిమినేషన్ కోసం నానినేషన్లు జరిగాయి. ఈసారి చాలా మందే నామినేట్ అయ్యారు. నామినేషన్ల గురించి చర్చించినందుకు శిక్షగా గీతామాధురిని జైలుకు పంపాల్సిందిగా కెప్టెన్ రోల్ రైడాను బాస్ ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*