బిగ్ బాస్ హోస్ట్ నాని గురించి కత్తి మహేష్ ఏమన్నారో తెలుసు?

బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేసారు. పదో తారీకు నుంచి మొదలైన రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సహజంగానే నానిని ఎన్టీఆర్ తో పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా కత్తి మహేష్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సెలబ్రిటీ అయిపోయింది సంగతి తెలిసిందే . మనం అనుకున్న దాన్ని దాచుకోకుండా చెప్పే గుణమున్న కత్తి మహేష్ బిగ్ బాస్2 వ్యాఖ్యాత నాని గురించి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను పరిచయం చేయడంలో నాని విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సభ్యుల వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుందని, అయితే సభ్యుల గురించి వివరాలు అందించడంలో నాని తగిన ఆసక్తి చూపలేకపోయారని కత్తి మహేష్ చెప్పారు. స్వతహాగా వ్యాఖ్యాత కు ఆసక్తి ఉంటేనే ఈ షో రక్తి కడుతుందని అన్నారు. దీనిపైన నాని ఎలా స్పందిస్తారో చూడాలి. అందించకుండా స్పందించకున్నా కత్తి మహేష్ ఎత్తిచూపిన లోపాలను నాని సరిదిద్ది ఉంటారా లేదా అనేది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*