బిగ్ బాస్-2 ర‌చ్చ‌ర‌చ్చేనా..?

తెలుగు ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో అల‌రించిన బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ 1కు జూనియ‌ర్ ఎన్‌టిఆర్ హోస్ట్ చేయ‌డంతో ఆ షోకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. బిగ్‌బాస్ 2కు నేచ‌ర‌ల్ హీరో నానీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హించ‌బోతున్నారు. ఈసారి మొత్తం 16 మంది బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళుతారు. ఆ పేర్ల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరో రాజ్ త‌రుణ్ , సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, యాంక‌ర్ లాస్య‌, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి, శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, ఆర్యన్‌ రాజేష్ ఉంటార‌ని చెబుతున్నారు. మొద‌టి సీజ‌న్‌తో పోల్చితే ఈ సీజ‌న్‌లోనివారంతా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. అందుకే గ‌తంకంటే షో్పైన ఆస‌క్తి పెరిగే అవ‌కాశాలున్నాయి. ఇటీవ‌ల కాస్ట కౌచింగ్ పేరుతో హంగామా చేసిన శ్రీ‌రెడ్డి కూడా హౌస్‌లో ఉంటార‌న్న వార్త‌ల‌తోనే ఈ షో ఎంత ర‌చ్చ‌ర‌చ్చ‌గా ఉండ‌బోతోందో అర్థం చేసుకోవ‌చ్చు. బిగ్‌బాస్ షోలో హీరో తరుణ్ ఉంటార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. అయితే ఆయ‌న స్పందిస్తూ…తాను బిగ్‌బాస్‌ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అసలు షోలో తనకు పార్టిసిపేట్‌ చేసే ఉద్దేశంగానీ, ఆసక్తి కానీ లేదని వెల్లడించారు. తాజాగా షో కాన్పెప్ట్‌ను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అక్వేరియంలో వివిధ రకాల చేపలను చూపిస్తూ రూపొందించిన ఈ టీజర్‌కు నాని వాయిస్ అంధించారు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది. వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్‌ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*