బిజెపిలో చేరిన టిడిపి నేతలు

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు,మాజీ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు, మాజీ సర్పంచులు,మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరులోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో, రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

బిజెపి తీర్థం పుచ్చుకున్న వారిలో రాచగున్నేరి మాజీ సర్పంచ్, జిల్లా టీడీపి నాయకులు బొల్లినేని జగన్నాథం నాయుడు, మద్దిలేడు మాజీ సర్పంచ్ ఫరాన్ ఫజరుల్లాఖాన్, మాజీ సర్పంచ్ దామినేటి మునిరెడ్డి, మాజీ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు కోనేటి సిద్ధులయ్య, టీడీపి జిల్లా నాయకులు ముప్పాళ్ల కుమార్ నాయుడు, అత్తిరాల శ్రీరాములు, పోలయ్య, శంకర్ రెడ్డి , బత్తయ్య యాదవ్, సుధాకర్ రెడ్డి, వీర రాఘవులు ,మస్తాన్, బాలాజీ నాయుడు, పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా దేశానికి సేవ చేసే భాగ్యం కలగడం సంతోషకరమని, ఇలాగే దేశ సేవ చేయడానికి మండలంలోని ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, శ్రీకాళహస్తి రూరల్ మండల అధ్యక్షులు కూనాటి నాగరాజు, సీనియర్ నాయకులు ధర్మయ్య యాదవ్ , మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*