బిజెపి మేకపోతు గాంభీర్యం!

దేశవ్యాపితంగా 4 లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. సిట్టింగ్‌ స్థానాలనూ కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌ కైరానాలో దాదాపు 50 వేల ఓట్లు తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై బిజెపి నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందన ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఈ ఓటమి 2019లో తాము సాధించబోయే భారీ విజయానికి సంకేతమని చెప్పారు. భారీ విజయాలు అందుకుంటున్న క్రమంలో కొన్ని చిన్నపాటి అపజయాలు ఉంటాయంటూ ఈ ఓటమిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ప్రతిపక్షాలు 2019 ఎన్నికల్లో అనుసరిస్తే బిజెపికి చుక్కలు కనిపించడం కాయం. ఉత్తర ప్రదేశ్‌ కైరానా నియోజకవర్గం వాస్తవంగా బిజెపిది. అక్కడి ఎంపి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. బిజెపిని ఎదుర్కోడానికి ఎస్‌పి, బిఎస్‌బి, కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డి కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. ఆర్‌ఎల్‌డి అభ్యర్థిని నిలబెట్టాయి. ఫలితంగా బిజెపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ…ప్రతిపక్షాలను చీల్చి ఓట్లు గెలవడం మీరు ఆడిన నేర్పిన ఆటే…అదే ఆటను ఇంకో పద్ధతిలో మేమూ ఆడుతున్నాం అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లోనూ ఉత్తప్రదేశ్‌లో అన్ని ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తే బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం.

వాస్తవంగా దేశ వ్యాపితంగా అన్ని ప్రాంతీయ పార్టీలూ బిజెపి ప్రమాదాన్ని గుర్తించాయి. నాయకులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం, బెదిరించడం, లెక్కచేయకపోవడం వంటి ధోరణులు ప్రాంతీయ పార్టీలను ఆలోచనలో పడేశాయి. బిజెపితో తమ ఉనికికే ప్రమాదమని గుర్తించాయి. ఇందులో మన రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే….బిజెపి అధికారాన్ని కోల్పోయి ఇంటిదారి పట్టాల్సిందే. అయితే….ఈవాస్తవాన్ని మరుగుపరుస్తూ ఉప ఎన్నికల్లో ఓటమి భవిష్యత్తులో తాము సాధించబోయే భారీ విజయానికి సంకేతని మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

1 Comment

  1. BJP, although it’s aim of working formula is stringent in environment like demobilisation, GST , oil and lubricants etc, so far they achieved nothing rather they gained bad impression of common and innocent public who are suffering lot on daily routine life. It seems they are lacking effective administers.

Leave a Reply

Your email address will not be published.


*