బుల్లెట్ దించిన‌ తిరుపతి‌ అర్బన్ ఎస్పీ..!

ఈ రోజుల్లో బుల్లెట్ బైక్ యువతకు ఫ్యాషన్ గా మారింది. ఖరీదైన బుల్లెట్ కొనడం, దా‌నికి కంపెనీ అమర్చిన సైలెన్సర్ తొలగించడం, ఎక్కవ శబ్ధం వచ్చే కొత్త సైలెన్సర్ బిగించడం, రోడ్లపై చక్కర్లు కొట్టడం. ఇది యువకులకు క్రేజీగా ఉండొచ్చుగానీ జనానికి కంపనం పుట్టిస్తుంది.

ఈ అంశంపై దృష్టి సారించిన తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి…ఆకస్మికంగా రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. బుల్లెట్లపై తిరిగేవారిని ఆపారు. ఎక్కవ శబ్దం చేసే సైలెన్సర్లను‌ అక్కడికక్కడే ఊడబెరికించారు.‌ వాహనాలను సీజ్ చేశారు. ఈ విధంగా సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు. అధిక‌ శబ్దం వల్ల పాఠశాలలు, ఆస్పత్రులు, దేవాలయాలలో ఏకాగ్రత ‌దెబ్బతింటుందన్నారు. యువకులు ఈ వాహనాలను వేగంగా నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు.‌ తమ పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

ఎస్పీ చేపట్టిన ఈ చర్యను అందరూ అభినందిస్తున్నారు. ప్రతి బుల్లెట్ వాహనాన్ని తనిఖీ చేసి సైలెన్సర్లు మార్పు చేసివువుంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుండగా రమేష్ రెడ్డి వచ్చినప్పటి‌ నుంచి ఇటువంటి‌ సామాజక సమస్యలపైన దృష్టిపెడుతూ చక్కది ద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే…వారిలో మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అందరి‌ ప్రశంసలూ‌ అందుకుంటున్నారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*