భారత్‌లో జైళ్లు బాగోలేవు…నేను రాను!

భారతదేశంలో బ్యాంకులకు, వివిధ సంస్థలకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్‌కు ఉడాయించిన….ఒకప్పటి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు సిబిఐ ప్రయత్నిస్తోంది. కొన్ని ఆధారాలను లండన్‌ కోర్టుకు సమర్పించి, మాల్యాను భారత్‌కు అప్పగించమని కోరుతోంది. ఇక్కడ కేసు విచారిస్తామని చెబుతోంది. దీనికి….లండన్‌ కోర్టులో విజయ్‌మాల్యా తరపున వాదిస్తున్న న్యాయవాదులు…భారత్‌లో జైళ్లు బాగుండవని, అందువల్ల మాల్యాను ఆ దేశానికి అప్పగించొద్దని వాదించారు. దీనికి మన సిబిఐ అధికారులు…ఐరోపో కూటమి నిబంధనలకు అనుగుణంగా మాల్యా జైలు గదిని సిద్ధం చేశామని….ఐరోపా దేశాల్లో జైలు గదుల్లో ఉన్న అన్ని సదుపాయాలూ కల్పిస్తామని చెప్పారు. మాల్యా అప్పగింతపై కోర్టు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మాల్యా తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కేసును జులై 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే తుది వాదనల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. సిబిఐ చెప్పిన దాన్నిబట్టి చూస్తే…మాల్యా కోసం అధునాతన సదుపాయాలతో జైలు గది సిద్ధంగా ఉందన్నమాట. అయితే మాల్యాను తీసుకురావడమే సమస్య.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*