మన మీడియా ఇలాగే వర్థిల్లాలి..!

మన పత్రికలు, టివి ఛానళ్లు వార్తలు రాయడం ఎప్పుడో మానేశాయి. కాకమ్మ కతలు, పిట్ట కతలు, పిట్ట దొర పొగడ్తలు రాయడం బాగా ఒంటబట్టించుకున్నాయి. పత్రిక తెరిస్తే మొదటి పేజీలోనే ఇవి కనిపిస్తాయి. ఏ క్షణాన టివి ఆన్‌ చేసినా….ఇటువంటి కథలే వినిపిస్తుంటాయి.

ఎనిమిది నెలల క్రితం దాకా పిట్టదొరల పొగడ్తతో నిండిపోతే….ఇప్పుడు కాకమ్మ కతలు, పిట్ట కతలు హోరెత్తుతున్నాయి. పాఠకలు, వీక్షకలు నమ్ముతారా నమ్మరా అనేదానితే పనిలేదు. నచ్చుతుందా నచ్చదా అనేదానితో నిమిత్తం లేదు. తాము అనుకున్నది రాసేదే. తాము చూపించానుకున్నది చూపించేదే.

ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా అమరావతి కోసమే చచ్చిపోతున్నారని చెబుతున్నారు. అమరావతిలో రాజధాని లేకపోతే….ఇక రాష్ట్రంలోని ప్రజల బతుకులు కుక్కలు చింపిన విస్తరి అయిపోతుందంటున్నారు. మొన్నామధ్య ఇసుక లేక అందరూ చచ్చిపోతున్నారని తెగ రాశారు. జనం అన్నానికి బదలు ఇసుక తిని బతుకుతున్నట్లు ప్రచారం చేశారు. ఇలా అమరావతి కతలు, ఇసుక కతలను జనరంజకం చేశారు.

ఆ తరువాత ఇంగ్లీషు మీడియాన్ని పట్టుకున్నారు. ఇంగ్లీషు చదువుకుంటే….తెలుగుకు తెగులొస్తుందన్నారు. తెలుగు రాకుంటే అమ్మా నాన్నను కూడా మరచిపోతారని, క్రూరులుగా మారిపోతారని, అరాచకం ప్రబలుతుందంటూ సెంటిమెంటు కతలు అల్లారు.

మందు ధరలు పెరిగితే…..బియ్యం ధరలు పెరిగినంతగా గగ్గోలు. మద్యం షాపును రాత్రి 8 గంటకే మూసేస్తుంటే….జనం మందు ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు తాగాలి అంటూ మందు బాబు శోకాన్ని రక్తికట్టించేలా ఒక కథ.

ఇప్పుడు పెట్టుబడు, ఫ్యాక్టరీలు అంటూ కొత్త కత అందుకున్నారు. మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగడమే తప్పంట. అందుకే పరిశ్రమలు పారిపోతున్నాయట. ఇదొక సరదా కథ.

పెన్షన్లు, రేషన్‌ కార్డు గురించి చెప్పాల్సిన పనిలేదు…. పెన్షన్లు పెరిగినా తగ్గినట్లే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఉదారంగా కోటీశ్వర్లకూ  రేషన్‌ కార్డులిస్తే జగన్‌ వాటిని తీసేసి, కడుపు కొడుతున్నారని గుండెలు బాదుకుంటూ…ఓ కన్నీటి గాథ వండేస్తారు.

ఎనిమిది నెల క్రితం వరకు…..రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎన్నికలకు నెల ముందు ఇచ్చిన పుసుపు-కుంకుమ అద్భుతం. రెండు నెల ముందు ఇచ్చిన నిరుగ్యోగ భృతి అనన్యం. మూడు నెలకు ముందు పెంచిన పింఛన్లు అహో…ఓహో.

రైతు రుణమాఫీని పంచపాండవులు మంచంకోళ్లులా నలుగురు సామెతలా చేసినా…వాహ్వా ! రాయసీమ ప్రాజెక్టల నెత్తిన మట్టిపోసి….రెయిన్‌ గన్లతో ఫోజుపెట్టినా అదరహో.

పెట్టుబడలు సదస్సులకే పరిమితమైనా… అద్భతం, ఆహో, ఓవో, అదరహో, వాహ్వా, సూపర్‌, డూపర్‌.

తాగేదానికి నీళ్లు లేకున్నా అమరావతి అంతర్జాతీయ నగరం. ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరం. అదో అంతులేని హరికత.

మన మీడియా ఇలాగే పది కాలాలు ఇలాగే వర్ధిల్లాలి. మన పాఠకులు, వీక్షకులు ఇలాగే విలవిల్లాడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*