‘మహానటి’ సావిత్రి కన్నీటి గాథ తెలుసా?

ఆలనాటి అందాల తార, మహానటి సావిత్ర జీవిత గాథ ఆధారంగా ‘మహానటి’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈనెల 9 తేదీన ఆ సినిమా విడుదల కాబోంది. కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలలో ఒదిగిపోవడమేగాదు… అచ్చుగుద్దినట్లు సావిత్రలాగే కనిపిస్తున్నారు. మోహన్‌ బాబు ఘటోత్కజుడుగా ఎస్‌వి రంగారావు పాత్రను పోషించారు. ఇంకా యువహోరోలు నాగచైతన్య అక్కినేని పాత్ర చేశారు. ఇంకా ఎన్‌టిఆర్‌, జెమినీ గణేష్‌ తదితర పాత్రలూ కనిపిస్తాయి. సావిత్రి సినీ జీవితంతో సంబంధమున్న ప్రముఖులందరూ ఇందులో కనిపించబోతున్నారు. ట్రైలర్లు చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత కలుగుతోంది.

సావిత్ర మహానటి…అందులో సందేహం లేదు. ఆమె వెండితెరపై ధ్రువతారలా వెలిగారు. 1950లో ఎల్‌వి ప్రసాద్‌ దర్శకత్వం వహించిన సంసారంతో తెరంగేట్రం చేసిన ఆ అభినేత్రి గోరింటారుకు దాకా 80కిపైగా సినిమాలు నటించారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ సినీపరిశ్రమను మహారాణిలా సావిత్ర ఎప్పటికీ మహారాణిగానే ఉంటారు.

అయితే…నేటి తరానికి ఆ మహానటి గురించి తెలిసినది ఎంత? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎంతో శ్రమకోర్చి, పరిశోధన చేసిన ఈ సినిమా తీశారు. ఆమె 1981లో మరణించారు. 37 ఏళ్లు అవుతోంది. ఇప్పడు యువకులుగా ఉన్న వారి తల్లిదండ్రులకు ఊహ తెలిసేనాటికే మరణించారు. అటువంటి నటి గురించి తీసిన మహానటి జనాన్ని ఏమేరకు థియాటర్లకు రప్పించగలుగుతుందనేది చూడాలి. అయితే….నాగ చైతన, మోహన్‌బాబు వంటివారు నటించడం వల్ల కొంత ఆకర్షణ అయితే ఉంది. అయితే…ఒక మంచి కథ ఉన్న సినిమాగా మహానటి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ఎందుకంటే…సావిత్రి జీవితం సినిమాలాగే ఉంటుంది. సావిత్రి 1937లో జన్మించారు. ఆమెకు ఆరేళ్ల వయసపుడే తండ్రి మరణించారు. దీంతో విజయవాడలోని పెద్దమ్మ (అమ్మకు అక్క) ఇంటికి చేరింది సావిత్రి కుటుంబం. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పెదనాన్న ప్రోత్సాహంతో సినీ రంగప్రవేశం చేసిన ఆమె….ఆ రంగంలో హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగింది. నగలంటే సావిత్రకి ఎంతోప్రీతి. దానగుణం నిండుగా కలిగిన మానవతామూర్తి. దాన ధర్మాలకు ఆమె చేతికి ఎముక లేదంటారు. ఒకసారి ప్రధాన మంత్రి లాల్‌బహుదూర్‌ శాస్త్రిని కలిసేందుకు వెళ్లి…తన ఒంటిపై ఉన్న నగలన్నీ ఒలిచి ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇచ్చారట. అలాంటి ఉదారత కలిగిన నటి. 1956లో జెమినీ గణేషన్‌ను పెళ్లి చేకున్నారు. అప్పటికే ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కూతురు, కొడుకు ఇద్దరు పిల్లలు పుట్టారు. జెమినీ గణేషన్‌తో వివాహ బంధం నిలవలేదు. ఆర్థికంగా చితికిపోయింది సావిత్రి. అప్పులపాలై తాగుడుకు, మత్తుకు బాసినై 1981 డిసెంబర్‌ 26న మరణించారు. ఇదంతా వింటుంటే సినిమా కథలా అనిపిస్తుంది. ఈ కథను హృద్యంగా తెరకెక్కించివుంటే… సావిత్రి అనే పేరు తెలియని జనం కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రంగానూ ఉంటుంది.

మహానటి సినిమాలో జెమినీ గణషన్‌ పాత్ర ఎలా చూపించారనేది సావిత్రి జీవితాన్ని గురించి తెలిసినవారు ఎదురుచూస్తున్న అంశం. సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మాటల రచయిత మాట్లాడుతూ…’ఈ సినిమా చూస్తే జెనిమీ గనేషన్‌పై కోపం వస్తుంది’ అని అన్నారు. అంటే ఆయన్ను నెగిటివ్‌ షేడ్స్‌లో చూపించారా? అనేది చూడాలి. ఇది ఏదైనా వివాదాలకు దారితీస్తుందా అనేది కూడా ఆసక్తి కలిగిస్తున్న అంశమే. ఈ సినిమాలో సమంత జర్నలిస్టు పాత్రలో నటించారట. సినీ విలేకరులకూ సినీనటుల జీవితాల్లోనే అనేక విషయాలు తెలుస్తాయి. ఒకప్పుడు సినిమా విలేకరులు నటీనటులతో చాలా దగ్గరగా మెలిగేవారు. వారి రహస్య జీవితాలు కూడా విలేకరులకు తెలిసేవి. ఒకప్పుడు సినిమా విశేషాలు తెలుసుకోవాలంటే పత్రికలే ఆధారంగా ఉండేవి. మొత్తంగా చూస్తే సమంత పాత్రికూ మంచి ప్రాధాన్యతే ఉంటుందనిపిస్తోంది. చూద్దాం..ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో, ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*