మహాశివరాత్రి ఉత్సవాలకు కట్టుదిట్టమైన చర్యలు..!

  • 6 వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత
  • డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీలతో నిఘా
  • శ్రీకాళహస్తి డిఎస్పీ నాగేంద్రుడు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు శ్రీకాళహస్తి డిఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. శివరాత్రి ఏర్పాట్లుపై ధర్మచక్రంతో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాని చెన్నారు.

ఇప్పటికే 400 మంది పోలీసులు ఉత్సవాల విధుల్లో ఉన్నారని చెప్పారు. మహాశివరాత్రి, రధోత్సవం, కళ్యాణోత్సవం వంటి ముఖ్యమైన ఉత్సవాలకు మరో 200 మంది పోలీసులు రానున్నట్లు తెలిపారు. 3 డిఎస్పీ లు ,15 మంది సిఐలు, ఎస్ఐలతో పాటు మొత్తం 6 వందల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఇందులో 70 మంది వరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారన్నారు.

శ్రీకాళహస్తిలో మొత్తం120 సిసి కెమెరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. మఖ్యమైన పర్వదినాల్లో 6 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. మూడు రోజులు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, ద్విచక్ర వాహనాల మినహా మిగతావి పట్టణంలోకి అనుమతించేది లేదన్నారు.

శివరాత్రి రోజు దేవస్థానం ఏర్పాటు చేసిన మినీ బస్సులు భక్తులకు సేవలు అందిస్తాయన్నారు. రథోత్సవం రోజు చోరీలు అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలు,24 మంది క్రైమ్ పార్టీ పోలీసులతో నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్ఐలు, 60 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తారని వివరించారు.

మహాశివరాత్రి, లింగోద్భవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూసేందుకు 4 ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్ఐతో పోలీసులు, ఐసిడిఎస్, ప్రజాసంఘాల నేతలు ఉన్నారని చెప్పారు. ముఖ్యమైన మూడు రోజులు పట్టణంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు సిఐ నాగేంద్రుడు వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*