మహేష్‌ బాబుకు నచ్చిన సిఎం ఎవరు?

ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అను నేను’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రిగా నటించారు. సిఎం పాత్రను ఎలా పోషించారు, సిఎంగా మహేష్‌గా ఏం చేశారు అనేదానిపై అభిమానుల్లో ఆసక్తివుంది. ప్రస్తుత రాజకీయాల ఈ సినిమా ప్రభావంపై ఉంటుందా అనేది కూడా ఆసక్తికరమైన అంశంగా ఉంది.

ఈ చిత్రంలో నటించడంతో రాజకీయాలపై తనకు మరింత అవగాహన ఏర్పడిందని మహేష్‌ చెప్పారు. ముఖ్యమంత్రి అంటే అంత ఆషామాషీ బాధ్యత కాదన్నారు. ఒక రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత సిఎంపై ఉంటుందని చెప్పారు. ఇవన్నీ చెప్పిన మహేష్‌…’మీ దృష్టిలో బెస్ట్‌ సిఎం ఎవరు?’ అంటే మాత్రం సమాధానం చెప్పలేదు. ‘నాతో ఏదో ఒకటి మాట్లాడించి…వివాదాస్పదం చేయొద్దు’ అనేసి ఊరుకున్నారు. అయితే….ప్రతి ముఖ్యమంత్రి బెస్ట్‌గానే పని చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలపై వ్యగ్యాస్త్రం (సెటైర్‌) కూడా కాదని తేల్చేశారు. ఇదొక మంచి కథని, ఈ సినిమాను అన్ని పార్టీల నాయకులూ మెచ్చుకుంటారని వెల్లడించారు. మహేస్‌ మాటలను బట్టి తెలిసేదేమంటే….ఈ సినిమా ఏ పార్టీని బాధపెట్టే అవకాశం లేదు.

పొలిటికల్‌ జానర్‌లో వస్తున్న ఈ సినిమా గురించి మాట్లాడుకునేప్పుడు మహేష్‌ తండ్రి కృష్ణ గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు కృష్ణ తీసిన ‘నా పిలుపే ప్రభంజనం’, ‘మండలాధీశుడు’ సినిమాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఒక చిత్రంలో ఎన్‌టిఆర్‌ వేషధారణలో కోటా శ్రీనివాసరావు నటించారు. ఈ చిత్రాలు ఎన్‌టిఆర్‌ తీరుపైన, ఆయన పాలనపైన పొలిటికల్‌ సెటైర్లే. కృష్ణ అప్పట్లో కాంగ్రెస్‌కు దగ్గరగా ఉండేవారు. అలాంటి వివాదాలు ఏవీ ‘భరత్‌ అను నేను’లో కనిపించే అవకాశాలు లేవని తేలిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*