మాయావతి కర్నాటక వెళుతున్నారు! ఎవరి తరపున ప్రచారం చేస్తారో తెలుసా?

బిఎస్‌పి అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆమె జనతాదళ్‌ తరపున ప్రచారం చేయనున్నారు. ఆమే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. జాతీయ స్థాయిలో బిజెపిని నిలవురించడానికి కర్నాకట ఎన్నికలతోనే తమకు అవకాశం లభించబోతోందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌పి, బిఎస్‌పి పొత్తు పెట్టుకుంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. దీంతో బిజెపి మట్టికరచింది. ఇదే వ్యూహాన్ని లోక్‌సభ సాధారణ ఎన్నికల్లోనూ అనుసరించడానికి సిద్దమని ఆమె వెల్లడించారు. అయితే…ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ తరువాత ప్రకటిస్తామని, ఇందుకు చాలా సమయముందని అన్నారు. తమ పొత్తు బిజెపిని నిలువరించగలమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా కర్నాకటలో మాయావతి చేపట్టే ప్రచారం కచ్చితంగా జెడిఎస్‌కు లాభిస్తుంది. మాయావతికి దళితుల్లో దేశ వ్యాపితంగా పలుకుబడివుంది. ఆమె చెప్పే మాటలను దళితులు తప్పక ఆలకిస్తారు. నరేంద్ర మోడీ కర్నాకటలో దళితుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తమ పార్టీ దళితున్ని రాష్ట్రపతి చేసిందని, ఇంకా ఏదోదే చెబుతున్నారు. ఇలాంటి వాటికి మాయావతి బలమైన సమాధానం చెప్పే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలను ఆమె ప్రస్తావిస్తారు. దళితులకు వ్యతిరేకంగా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలనూ ఆమె ఎండగట్టే అవకాశాలున్నాయి. మాయావతి ప్రచారంతో బిజెపి అసలు రూపం బహిర్గతమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*