మాల్యా ఓటు విలువ రూ.9 వేల కోట్లు!

ఓటుకు ఐదు వందలో, వెయ్యి రూపాయలో, రెండు వేల రూపాయలలో ఇస్తున్నారని తెలుసు. మరి ఒక ఓటు విలువ రూ.9 వేల కోట్లు ఏమిటి? ఇదేగా అనుమానం. ఏమీ లేదండీ…విజయ మాల్యా అనే పారిశ్రామికవేత్త మన దేశంలో రూ.9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి…లండన్‌కు పారిపోయారు కదా…ఆయన ఓటు ఎవరికైనా కావాలంటే….వాళ్లే ఆయన బాకీపడిన ఆ రూ.9 వేల కోట్లు చెల్లించాలి. ఎందుకంటే…పాపం మాల్యాకి, కర్నాకట ఎన్నికల్లో ఓటేయాలని ఉందట. అయితే భారత్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడట.

విజయ్‌ మాల్యా రుణాల ఎగవేతకు సంబంధించి భారత్‌ సమర్పించిన ఆధారాలను లండన్‌ కోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారణకు హాజరైన సందర్భంగా ఆయన్ను మీడియా పలకరించింది. కర్నాకట ఎన్నికలపై అభిప్రాయం అడిగింది. ఆయన మాట్లాడుతూ…’కర్నాటకకు వెళ్లి ఓటేయాలని ఉందిగానీ…వెళ్లలేని స్థితిలో ఉన్నా’ అని చెప్పారు. తాను ప్రస్తుతం రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని, అందుకే కర్నాకట ఎన్నికలపై అభిప్రాయం చెప్పలేనని మాల్యా అన్నారు. ఏదమైనా మాల్యా ఓటు కావాలనుకునే పార్టీ ఏదైనా ఉంటే….ఆయన తరపున రూ.9 వేల కోట్ల చెల్లిస్తే ఓటు వేయించుకోవచ్చు. ఏ పార్టీ అయినా సిద్దపడుతుందా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*