మీడియాకు కరోనా ఉపద్రవం..! జర్నలిస్టులు కకావికలం..!!

కనిపించని శత్రువులా ప్రపంచంపై దాడి చేస్తున్న కరోనా…మీడియా రంగాన్నీ కుదేలు చేస్తోంది. అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడినట్లే…మీడియాలోనూ ఉపాధికి ఎసరు వచ్చింది. పాత్రికేయులు ఉద్యోగాలు పోగొట్టుకుని వీధినపడుతున్నారు. పని చేస్తున్న వారూ వేతనాల్లో కోతతో సతమతమవుతున్నారు. ప్రధానంగా ప్రింట్‌ మీడియా తీవ్ర సంక్షోభంలోకి వెళుతున్న సంకేతాలు స్పష్టంగా గొచ‌రిస్తున్నాయి.

తెలుగు దినపత్రికల విషయానికొస్తే…ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి అనుకూంగా ఉన్న ఓ పత్రిక…ఇప్పటికే సిబ్బందిని తగ్గించడం మొదుపెట్టింది. సబ్‌ ఎడిటర్లను, డిజైనర్లను ఇంటి ముఖం పట్టిస్తోంది. ఇలా తొగించిన వారికి రెండు నెలల‌ పాటు 25 శాతం వేతనం ఇస్తామని, అప్పటికి పరిస్థితి బాగుపడితే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని చెబుతున్నారట. అదేవిధంగా పని చేస్తున్న వారికీ వేతనాల్లో 30 శాతం  – 50 శాతం కోత తప్పదని ఇప్పటికే చెప్పేశారట.

ఇక మిగిలిన రెండు ప్రధాన పత్రికూ సిబ్బందిని కుదించడానికి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పత్రికల్లో పని చేస్తున్న పాత్రికేయుల‌కు దినమొక గండంగా గడుస్తోంది. ఏ క్షణాన పిలిచి…‘ఇక మీ సేమ చాలు’ అంటారో అని బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఆకస్మికంగా వచ్చింది కాదు. కరోనా రాక మునుపే రోగ క్షణాలు బయటపడుతూ వచ్చాయి. పత్రికలు మెయిన్‌, జిల్లా పేజీను కుదించుకోవడం, ఇప్పుడు జిల్లా పేజీల‌ను తీసేసి మెయిన్‌లో కలిపేయడం వంటి చర్యలు….పత్రికా రంగంలో తలెత్తుతున్న సంక్షోభానికి సంకేతంగా కనిపించాయి. పేజీలు తగ్గించినపుడే…చాలామంది సబ్‌ ఎడిటర్లు, విలేకయి ఉద్యోగాలు ఊడిపోతాయని చాలా మందికి అర్థమయింది.  

కరోనా తెబ్బతో…పెద్దపెద్ద పత్రికల‌కే ప్రకటన‌లు రావడం లేదు. కార్పొరేట్‌ యాడ్స్‌తోనే పత్రిక మనుగడ సాగుతోంది. పత్రిక నిండా సెల్‌ కంపెనీలు,  కార్లు, ద్విచక్ర వాహనా కంపెనీల‌ ప్రకటనలు, బంగారు దుకాణా ప్రకటనలు, వినియోగ వస్తువు ప్రకటనలు కనిపించేవావి. గత కొన్ని రోజుగా ఒకటంటే ఒక యాడ్‌ కూడా కనిపించడం లేదు.

ఆ మాటకొస్తే…ప్రింట్‌ మీడియాకు క్రమంగా యాడ్స్‌ తగ్గిపోతూ వస్తున్నాయి. టివి ఛానళ్లు వచ్చిన తరువాత కొంత భాగాన్ని అవి తన్నుకుపోయాయి. ఆ తరువాత డిజిటల్‌ మీడియా వచ్చేసింది. ప్రింట్‌, టివి చానళ్ల వాటాలోనే….డిజిటల్‌, సోషల్‌ మీడియా (వెబ్‌సైట్లు, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌…) తమ వాటాను విభజించుకుంది. ఇంకా చెప్పాంటే….క్రమంగా ప్రింట్‌, ఎక్ట్రానిక్‌ మీడియా యాడ్స్‌ తగ్గి డిజిటల్‌, సోషల్‌ మీడియా యాడ్స్‌ వాటా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఒక పత్రిక ఉంటే….పది టివి ఛానళ్లు వచ్చి ఆ పత్రిక యాడ్స్‌ను పంచుకున్నాయి. ఒక పత్రిక, పది టివి ఛానళ్ల యాడ్స్‌ను ఇప్పుడు వంద, వే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు పంచుకుంటున్నాయి.

ఇదే క్రమంలో….లోకల్‌ యాడ్స్‌ కూడా బాగా తగ్గిపోయాయని చెప్పాలి. పుట్టిన రోజు, వివాహలు, వర్ధంతులు వంటి యాడ్స్‌ కూడా పత్రికకు రావడం లేదు. ఫ్లెక్సీలు వేసుకోవడానికో, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోడానికో పరిమితం అవుతున్నారు. ఇది కూడా అగ్రశ్రేణి పత్రికకు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. ఇలా  ప్రింట్‌ మీడియాకు ఆర్థికంగా దెబ్బమీద దెబ్బపడుతూనే ఉంది.

ఇదే సమయంలో….ప్రింట్‌ మీడియా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో స్వయంకృతం కూడా చాలావుంది. పరిమితికి మించి పేజీలు పెంచుకుంటూ పోవడం కూడా భారంగా మారిందని చెప్పాలి. మెయిన్‌ 16 పేజీలు, జిల్లా 24 పేజీలు, మళ్లీ ప్రతి నియోజకవర్గానికి రెండు పేజీలు…ఇలా పోటీపడి పెంచేశాయి. ఈ పోటీలో ఒక దశలోనైతే….ఒక ప్రధాన పత్రిక ఫుల్‌ అవుట్‌ అంటూ ప్రతి నియోజకవర్గానికి జిల్లా టాబ్‌లాయిడ్‌తో పాటు నాలుగు పెద్ద పేజీలు (8 టాబ్‌లాయిడ్‌ పేజీు) ఇచ్చింది. ఇలా పెంచిన పేజీల‌ను చెత్తా చెదారంతో నింపడం మొదుపెట్టారు. సింగిల్ కాల‌మ్‌తో పోయే వార్తనూ అర్ధ పేజీ వసే పరిస్థితి వచ్చింది. విలేకరుకు లైన్‌ అకౌంట్‌ పెరిగివుండొచ్చుగానీ…..మీడియా సంస్థలు కోట్ల రూపాయల‌ భారాన్ని నెత్తికెత్తుకున్నాయి. ఈపరిస్థితుల్లోనే…న్యూస్‌ ప్రింట్ ధరలు రెండిరతు, మూడిరతు పెరిగాయి.  

పత్రికలు పరిమితికి పెంచి పేజీలు పెంచడం వెనుక రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. అది వేరేసంగతి కానీ….పెంచుకున్న పేజీకు అనుగుణంగా విలేకరును, సబ్‌ ఎడిటర్లను పెంచాల్సి వచ్చింది. ఒక నెంబర్‌ వన్‌ పత్రిక, తమ జర్నలిజం స్కూల్‌లో చదువుకని వచ్చిన వారిని తప్ప ఇతరును సబ్‌ ఎడిటర్లుగా తీసుకోని ఆ పత్రిక….కొంత సీనియర్‌గా ఉన్న విలేకరును డెస్క్‌ల్లోకి తీసుకుంది. అలాగే మండలానికి ఒక విలేకరి ఉండాల్సిన చోట….మండలాన్ని రెండుగా విడగొట్టి ఇద్దరు విలేకరును పెట్టింది. నగరాల్లోనైతే వీధివీధికీ విలేకరును నియమించింది.

అప్పటి తమ అవరా కోసం విలేకరుల‌ను, సబ్‌ ఎడిటర్లను తీసుకున్న పత్రికలు…ఇప్పుడు సంక్షోభం వచ్చేసరికి నిర్దయగా ఇంటికి పంపేస్తున్నాయి. పని చేస్తున్న వారికి సగానికి సగం వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఇక విలేకరుల‌కు జీతాలు ఎటూ ఇచ్చేది లేదు. అయితే….పేజీలు ఎక్కువగా ఉన్నప్పుడు మండల‌ విలేకరుల‌కు మూడు నాలుగు వేలైనా వచ్చేది. ఇప్పుడు మూడు నాలుగు వందలు కూడా రాని దుస్థితి. ఉద్యోగం కోల్పోయిన పాత్రికేయులు ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తలు పట్టుకున్నారు. ఉపాధి హామీ కూలీకి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాం కనిపించడం లేదని ఓ పాత్రికేయుడు తన ఆవేదనను వెల్ల‌బోసుకున్నారు.

ఇక ప్రింట్‌ మీడియా భవతవ్వాన్ని గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాతనైనా ఈ రంగం కోలుకుంటుందన్న ఆశలు కనిపించడం లేదు. కరోనా సోకుతుందన్న భయంతో పాఠకులు పత్రికలు తీసుకోవడం ఆపేశారు. దీంతో అగ్రశ్రేణి పత్రికల‌ సర్క్యులేషన్‌ భారీగా తగ్గిపోయింది. కరోనా తగ్గిన తరువాతనైనా సర్క్యులేషన్‌ పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే…పాఠకు మెల్ల‌గా ఇ-పేపర్‌ చదవడానికి అవాటుపడుతున్నారు. పత్రిక ఖరీదు రూ.2 ఉన్నప్పుడు అందరూ పత్రికలు తీసుకున్నారు. ఇంటికి రెండు పత్రికలు తెప్పించున్నవాళ్లూ ఉన్నారు. అయితే….పత్రికలు పేజీ రూపంలో పెంచుకున్న భారాన్ని కొద్దిగానైనా తగ్గించుకునేందుకు…పత్రిక ధర పెంచి పాఠకుపై మోపారు. ఈ పరిస్థితుల్లో పత్రిక కొనడం భారంగానూ మారింది.

ఎటూ ప్రతిసెల్‌లోనూ ఇంటర్నెట్‌ ఉంది కాబట్టి….ఇ-పత్రికు చదవడం అల‌వాటు చేసుకుంటున్నారు. కరోనా అనేది ఒక సందర్భమే తప్ప….ప్రింట్‌లో పత్రికను చదవడం క్రమంగా తగ్గిపోతోంది. ‘టివి చానళ్లు వచ్చినపుడూ పత్రిక సర్క్యులేషన్‌ తగ్గిపోతుందన్న ప్రచారం జరిగింది. కానీ అటువంటిది జరగలేదు. ఇంకా చెప్పాంటే సర్క్యులేషన్‌ పెరిగింది కదా…ఇప్పుడూ అంతే’ అనే వాళ్లూ ఉన్నారు. ఈ వాదనలో కొంత వాస్తవం లేకపోలేదు. టివి చానళ్లు వచ్చిన తరువాత పత్రిక సర్క్యులేషన్‌ పెరిగాయి. టివిలో వచ్చిన దాన్ని పత్రికల్లో ఏమి రాశారో చూడటం అవాటు చేసుకోవడం వ్ల సర్క్యులేషన్‌ పెరిగింది. అయితే….ఇప్పటి పరిస్థితి వేరు. డిజిటల్‌ మీడియా వచ్చేసింది. క్షణాల్లో వార్తలు వెబ్‌సైట్ల రూపంలోనూ, యూట్యూబ్‌ ఛానళ్ల రూపంలోనూ వచ్చేస్తున్నాయి. నేరుగా వాట్సాప్‌కు చేరుతున్నాయి.  ప్రధాన పత్రిక వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే….వార్త పబ్లిష్‌ అయిన వెంటనే నోటిఫికేషన్లు వస్తున్నాయి. అదేవిధంగా ఈ పత్రికలో ఇ`పేపర్‌నూ అందుబాటులో ఉంచుతున్నాయి.   యువతరం పత్రికల‌ను అసు చూడటం లేదు. డిజిటల్‌ మీడియానే ఫాలో అవుతోంది. ఈ పరిస్థితుల్లో పత్రిక అవసరం క్రమంగా తీరిపోతోంది. అందుకే…..ఇక సర్యుకేషన్‌ తగ్గడం మినహా పెరిగే అవకాశం లేదన్నది మీడియా రంగ నిపుణు విశ్లేషణ.

ఇదే ఇప్పుడు పత్రికాధిపతుల‌ను ఆందోళనకు గురిచేస్తోంది. సర్క్యులేషన్‌ లేకుంటే….కార్పొరేట్‌ సంస్థలు ప్రకటన‌లు ఇవ్వవు. ఆ ప్రకటను లేకుంటే….పత్రికా నిర్వహణ కష్టతరంగా మారిపోతుంది. అందుకే ప్రింట్‌ మీడియా రంగం కరోనా తరువాత కోలుకున్నా….పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మాత్రం లేవని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్లీ మెయిన్‌ 18 పేజీు, జిల్లా 24 పేజీు, నియోజకవర్గానికి రెండు పేజీలు…ఇచ్చే పరిస్థితి ఉండదు. అసలు అవసరం కూడా లేదు. ఈ విషయం పేజీలు తగ్గించిన సందర్భంగా మీడియా సంస్థకూ అవగతం అయింది. అందుకే అవి…మళ్లీ అటువైపు అడుగు వేయకపోవచ్చు.

ఈ నేపథ్యంలో జర్నలిస్టు పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. ఈ రంగం నుంచి తప్పుకుని, ప్రత్యామ్నాయం ఉంటే చూసుకోవడం ఉత్తమం. ఇదే రంగంలో కొనసాగాంటే….డిజిటల్‌ మీడియానే శరణ్యంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంకా పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌ ఛానళ్లు పురుడుపోసుకోవచ్చు. ఇటువంటి వాటిల్లో అవకాశాలు వెతుక్కోవడం ఒక్కటే ఇప్పుడు జర్నలిస్టుల‌ ముందున్న అవకాశం.

– ఆదిమూం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*