మీడియా ముందుకు రమణ దీక్షితులు…. అనూహ్య విషయాలు వెల్లడి..!

గత ఏడాది జూన్ లో ఆకస్మికంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించబడిన తరువాత…అనేక పర్యాయాలు మీడియాతో మాట్లాడిన రమణ దీక్షితులు….చాలా రోజులుగా మౌనంగా ఉన్నారు. తాజాగా ఆయన్ను‌ టిటిడి ఆగమ సలహా మండలి‌ సభ్యునిగా నియమించిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనను వారం లోపు ప్రధాన అర్చకునిగా నియమిస్తామని ముఖ్యమంత్రి ‌జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీతోనే ఆగమ సలహా మండలి సభ్యునిగా బాధ్యతలు తీసికున్నానని చెప్పారు. ఆయన ఏమి చెప్పారంటే…

 • శ్రీవారికి అనాది కాలంగా నాలుగు కుటుంబాల‌ అర్చకులు ఆటంకం లేకుండా పూజలు నిర్వహిస్తున్నాం
 • 1987 లో ఒక చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు కాబడినది, దాంతో వేలాది మంది అర్చక కుటుంబాలు రోడ్డునా పడ్డారు
 • 2004 చట్టంలో సవరణలు చేసి వంశపారంపర్య హక్కులను అర్చకులి దివంగత సీఎం వైఎస్సాఅర్ కల్పించారు
 • ఆగమశాస్త్రంలో కానీ,చట్టంలో కానీ అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితిని నిబంధనేది లేదు
 • గత టీడీపీ ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని సృష్టించి అర్చకులను బలవంతంగా రిటైర్డ్ చేసారు
 • వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అర్చకులకు పదవీవిరమణ రద్దు చేసి మాట నిలబెట్టుకున్నారు
 • పదవీవిరమణ చట్టం రద్దు చేసి టీటీడీ ఆగమ సలహాదారుడిగా తనను నియమించడంతో పాటు మరో వారంరోజుల్లో ప్రధాన అర్చకుడు హోదా కల్పిస్తారని సీఎం హామీ ఇచ్చారు
 • తనతో పాటు మిగతా వంశపారంపర్య అర్చకులకు యధాస్థానం తిరిగి కేటాయిస్తామని టీటీడీ హామీ మేరకు ప్రస్తుతం ఆగమ‌ సలహామండలి సభ్యులుగా భాద్యతలు స్వీకరించాం
 • బ్రహ్మా ణులు, అర్చకుల సంక్షేమార్థం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు హర్షనీయం
 • సీఎం జగన్ సుపరిపాలన‌కు ఫలితంగా రాష్ట్రంలో ఎన్నడూ నిండిన జలాశయాలు నిండుకుండను తలపిస్తుంది..
 • మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*