‘మీరెవరు’…..’నేను రజనీకాంత్‌’!

తమిళనాడులోనే కాదు దక్షిణ భాతర దేశం మొత్తం అభిమానులు కలిగిన ఏకైక నటుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌. ఆయన్న ఆరాధించే ప్రేక్షకులున్నారు. ఆయన కోసం పడిచస్తారు. ఒక్ష క్షణం ఆయన్ను చూడటానికి తపించిపోతారు. అలాంటిది రజనీకాంత్‌ స్వయంగా అతని ముందు ప్రత్యక్షమైతే…’మీరెవరు’ అని అడిగాడట ఓ యువకుడు. దీంతో రజనీకాంత్‌తో పాటు ఆయనతో పాటు ఉన్నవారంతా షాక్‌ అయ్యారు.

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడిలో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ మూసేయాలని ఆందోళన నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరగపడం, 13 మంది చనిపోవడం, అనేక మంది గాయపడటం తెలిసిన విషయాలే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి వెళ్లారు రజినీకాంత్‌. సంతోష్‌ రాజ్‌ అనే యువకున్ని పరామర్శిస్తుండగా ‘మీరెవరు’ అని ప్రశ్నించాడట అతను. దీంతో ఒక్క క్షణం విస్మయానికి గురయిన రజనీకాత్‌ తేరుకుని ‘నేను రజనీకాంత్‌’ అని చెప్పారట. జ్ఞాపకశక్తి కోల్పోయాడే ఏమోగానీ… పరామర్శించడానికి వచ్చిన ప్రముఖులందరీ ఇదే విధంగా ప్రశ్నిస్తున్నాడట ఆ యువకుడు. రజనీకాంత్‌నే మీరెవరు అని ప్రశ్నిస్తాడా అంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుగానీ…ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*