మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ ఉంటే…కరోనాపై విజయం సులభం..!

పల్స్ ఆక్సిమీట్…చిన్నపాటి వైద్య పరికరం. మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోడాని వాడే పరికరం. ర‌క్తంలోని ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఉప‌యోగిస్తారు. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ప‌ల్మన‌రీ డిసీజ్, ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోజులకు ఈ మీటర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
పల్స్ ఆక్సిమీటర్ వాడడం కూడా సులభం. చేతి వేలి కొనకు క్లిప్పులా ఈ మీటర్ ను పెట్డాలి.‌ మీట నొక్కితే…క్షణాల్లో ఎల్ఈడి తెరపై ఫలితం కనిపిస్తుంది. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. తేడా వస్తే ప్రమాదమని‌ గుర్తించాలి. దీని కనిష్ట ధర రూ.1000గా ఉంది. ప్రతి ఇంట్లో ఆక్సిమీటర్ ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఆక్సిమీటర్ అవసరం ఏమిటి..!
కరోనా సోకినవారిలో అధిక శాతం…రక్తంలో ‌ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల మరణిస్తున్నట్లు తేలింది. అయితే…ఆ విధంగా ఆక్సిజన్ స్థాయి తగ్గతున్నట్లు రోగులకు తెలియడం లేదు.‌ అసలు లక్షణాలు (జ్వరం, దగ్గు, ఆయాసం) కనిపించకున్నా…బాగున్నట్లే కనిపిస్తున్నా…ఆకస్మికంగా అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి కారణం రక్తంలలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం గుర్తించకపోవడమే అని వైద్యులు చెబుతున్నారు. ‌అదే ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్న దశలో గుర్తించి, వైద్యం చేయగలిగితే రోగిని కాపడవచ్చు. అందుకే…ఆక్సిమీటర్ తో రోజూ ఆక్సిజన్ పరీక్షించుకోవాలని, ఏదైనా తేడా వుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. – ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*