ముక్కంటి భక్తుల బసకు బాసట…దేవస్థానం అతిథి గృహాలు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీ శ్వరాలయం ఆధ్వర్యంలో నడపబడుతున్న అతిథి గృహాలు ఇక్కడికి విచ్చేస్తున్న వేలాది మంది భక్తుల బసకు బాసటగా ఉన్నాయి. ప్రయివేటు అతిథి గృహాల్లో సరైన సౌకర్యాలు లేనప్పటికీ వందలాది రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. దేవస్థానం నడుపుతున్న అతిథిగృహాల్లోని గదుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ తక్కువ అద్దెలు వసూలు చేస్తూ భక్తులకు సేవలంది స్తున్నాయి.

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో భక్తకన్నప్ప సదన్, వరదరాజులస్వామి అతిథిగృహం, శ్రీజ్ఞానప్రసూనాంబ సదన్, గంగాసదన్, భరద్వాజ సదన్, త్రినేత్ర అతిథి గృహం భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి.

కన్నప్ప సదన్ లో 35 గదులు ఉండగా అందులో 15 సాధారణ గదులు, 20ఎసి గదులు ఉన్నాయి. సాధారణ గదులకు ఒక్కో దానికి రూ.300 కాగా, ఎసి గదులకు రూ.800 అద్దె వసూలు చేస్తున్నారు.

వరదరాజులస్వామి అతిథిగృహంలో 12 గదులు ఉన్నాయి. ఇందులో 8 గదులు రూ.150 మరో 4 గదులు రూ. 250 అద్దెకు ఇస్తున్నారు.

దేవస్థానం సమీపంలో ఉన్న శ్రీజ్ఞానప్రసూనాంబ సదన్ లో 43 గదులు ఉన్నాయి. ఇందులో ఎసి గదుల అద్దె రూ.1000కాగా, నాన్ఏసి గదులకు రూ.800 చెల్లించాల్సి ఉంది.

లోబావి సమీపంలో ఉన్న గంగాసదన్ లో 32 గదులు,5 డార్మిటీలు ఉన్నాయి. ఇక్కడ ఏసి గదులకు రూ.999 కాగా, నాన్ఏసి గదులకు రూ.666 అద్దె వసూలు చేస్తున్నారు. ఈ అతిథిగృహం నుంచి రాకపోకలు సాగించేందుకు దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యం ఉంది.

త్రినేత్ర అతిథిగృహం లో 28 గదులు ఉన్నాయి. తాజాగా దీనిని ఆధునీకరించారు. ఇవి కాకుండా మరో రెండు అతిథి గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవికూడా పూర్తయితే భక్తులకు వసతి సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది.

దేవస్థానం అతిథి గృహాల్లో గదులను ఆన్ లైన్ పద్దతిలో బుక్ చేసుకోవచ్చు.

ఆధునీకరించిన త్రినేత్ర అతిథి గృహాన్ని ప్రారంభింన‌ ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి, పక్కన ఈఓ చంద్రశేఖర్ రెడ్డి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*