ముద్రగడ కాంగ్రెస్‌లో చేరుతారా?

త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తనేత వస్తారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చింతా మోహన్‌ చెబుతున్నారు. అయితే ఆయితే ఆ నేత ఎవరనేది ఆయన వెల్లడించడం లేదు. వాస్తవంగా గత కొంతకాలంగా ఈ విషయమై ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌ కాకుండా కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ వస్తున్నారు. ఆ నాయకుడు ఎవరు అని అడిగితే మాత్రం చెప్పడం లేదు.

కాపు రిజర్వేషన్ల కోసం తీవ్రంగా పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంతో ఇటీవల కాలంలో చింతా మోహన్‌ సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లను చింతా మోహన్‌ సమర్థిస్తూ వస్తున్నారు. ఒకసారి పద్మనాభం ఇంటికి వెళ్లి కలిసొచ్చారు కూడా. ముద్రగడ తిరుపతికి వస్తే చింతా మోహన్‌ను కలిసి చర్చించారు. రెడ్లు, కమ్మలు కాకుండా మరో సామాజికవర్గంవారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చింతా మోహన్‌ గట్టిగా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే ముద్రగడను కాంగ్రెస్‌లోకి తీసుకొస్తారేమో అని కొందరు అంచనా వేస్తున్నారు. గతంలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌తో ఉండేది. జగన్‌ వైసిపి స్థాపించిన తరువాత ఆ సామాజిక వర్గం జగన్‌తోనే ఉంది. ఇప్పుడు ఆర్థిక బలమున్న సామాజికవర్గం ఏదీ కాంగ్రెస్‌తో లేదు. ఆ ఖాళీని కాపులతో భర్తీ చేయాలని చింతా మోహన్‌ యోచిస్తున్నట్లున్నారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినా నిలబడలేకపోయారు. ఇప్పుడు జనసేనతో వస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఏమేరకు విజయవంతం అవుతారో చెప్పలేం. అయినా కాపులు ఒంటరిగా వెళ్లడం కంటే కాంగ్రెస్‌ వంటి పార్టీతో వెళితే….సులభంగా విజయం సాధించొచ్చు. అదేవిధంగా ఇది కాంగ్రెస్‌కూ లాభసాటిగా ఉంటుంది. రాష్రంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన మూడు సామాజిక వర్గాల్లో ఒక వర్గం కాంగ్రెస్‌తో ఉన్నట్లు అవుతుంది. ఈ లెక్కలతోనే కాంగ్రెస్‌కు కొత్త నాయకుడొస్తారని చింతా మోహన్‌ చెబుతున్నారని పరిశీలకుగు చెబుతున్నారు.

ముద్రగడ పద్మనాభం…తెలుగుదేశంతో వెళ్లలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపికి వెళితే నష్టమే తప్ప లాభం లేదు. పైగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా, పార్లమెంటులో ఆమోదించడానికి బిజెపి ఎలాంటి చొరవా తీసుకోలేదు. వైసిపిలో చేరినా, జనసేనలో చేరినా ముద్రగడ చాలామంది నాయకుల్లో ఒకరిగా ఉండిపోతారు తప్ప…తనకంటూ ప్రత్యేకతను నిలుపుకోలేరు. కాంగ్రెస్‌లోనైతే ముద్రగడకు ప్రాథాన్యత లభించే అవకాశాలున్నాయి. కొన్ని నెలల్లోనే ముద్రగడ రాజకీయ భవిత్యం తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*