మురళీ మోహన్‌గారూ…’తిరుమల వెంకన్న చౌదరి’ ఏమిటి?

సినీనటుడు మురళీ మోహన్‌ సాక్ష్యాత్తు తిరుమల వెంకన్నకూ కులం తగిలించేశారు. ఎందుకు అలా అన్నారోగానీ….తిరుమల శ్రీనివాసుడిని వెంకన్న చౌదరి అనేశారు. దీనిపైన సోషల్‌ మీడియా మురళీ మోహన్‌ను చెడుగుడు ఆడుకుంటోంది. ఏదో ఒక సమావేశంలో మాట్లాడిన మురళీ మోహన్‌…మొన్న కర్నాటక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్నారు. తెలుగు ప్రజలు బుద్ధిచెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కొన్ని సీట్లు మాత్రం తగ్గించి తిరుమల వెంకన్న చౌదరి….తిరుమల వెంకన్న చౌదరి….అంటూ నాలుక కరచుకున్నారు. తనకు బాగా పరిచయం, తరచూ పలికే వెంకన్న చౌదరి ఎవరైనా ఉండివుండాలి. అలవాటులో పొరపాటున తిరుమల వెంకన్న గురించి చెబుతూ వెంకన్న చౌదరి అని తబడబడి వుండాలి. ఏమి జరిగిందోగానీ సోషల్‌ మీడియా చేతికి చిక్కిపోయారు మురళీ మోహన్‌. పద్మావతమ్మది కులం, గోవిందరాజస్వావిది ఏ కులం, వరాహస్వామిది ఏ కులం…అవి కూడా మీరే చెప్పండి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*