మూడు రాజధానులు ఉంటాయి… అసెంబ్లీ వేదికగా మరోసారి స్పష్టం చేసిన ప్రభుత్వం..!

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బడ్జెట్ శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ తో ఈ మాట చెప్పించింది. గవర్నర్ తన ప్రసంగంలో… రాష్ట్రంలోని‌ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే క్రమంలో ఎర్పాటు చేయగలచుకున్న మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని చెప్పారు. దీనికి సంబంధించిన శాసన ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*