అత‌నో పిచ్చి ప్రేమికుడు….!

అత‌నో పిచ్చి ప్రేమికుడు. ప్రేయ‌సితో గొడ‌వ పెట్టుకుని క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి ప‌చ్చి ప‌ని చేశాడు. పోలీసుల ఆగ్ర‌హానిక గుర‌య్యాడు…ఇంత‌కీ ఆ ప్రేమికుడు ఏం చేశాడు? పోలీసులు అత‌న్ని ఏం చేశారు…

ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రేమించిన అమ్మాయితో గొడవ పడటంతో తను మాట్లాడటం లేదని బిత్తిరి చర్యకు పాల్పడిన ప్రియుడు చిక్కుల్లో పడ్డాడు. వివరాలు.. పుణెకు దగ్గర్లోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన నీలేశ్‌ ఖేడెకర్‌ తన ప్రేయసితో గొడపెట్టుకున్నాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె అవకాశం ఇవ్వలేదు. ముంబై నుంచి చించ్వాడ్‌ మీదుగా పుణెకు వెళ్తుందని సమాచారం తెలుసుకున్నాడు. రాత్రికిరాత్రే తన స్నేహితుడి సహాయంతో ‘ఐయామ్‌ సారీ’ అంటూ ఆమె పేరు రాసిన సుమారు 300 బ్యానర్లు నగరమంతా కట్టాడు.

ప్రియుడు చేసిన ప్రయత్నం ప్రేయసికి నచ్చిందో లేదో కాని మున్సిపల్‌, పోలీస్‌ శాఖలకు మాత్రం నచ్చలేదు. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పెట్టడం నిషేదం. దీంతో నీలేశ్‌పై చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబదించిన వార్త సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రియురాలి కోసం చేసిన పని కాబట్టి క్షమించి వదిలేయాలని కొందరు కోరుతుండగా.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిందిగా మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.


హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*