మెగాస్టార్ చిరంజీవి విరాళాలు – కరోనా వేళ సినీ నటుల రాజకీయాలు..!

కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) పేరుతో టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన సంస్థకు విరాళాలిచ్చేందుకు సినీతారలు క్యూ కడుతున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తి కారణంగా షూటింగులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే సినీ పరిశ్రమలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఉంది. గతంలో సినీ పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి చారిటీ కార్యక్రమాలనైనా ఈ సంస్థ ద్వారానే జరిపేవారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా చిరంజీవి ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పాటైంది. మా లాంటి అసోసియేషన్ ఉండగా తిరిగి ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏమిటన్నది ప్రశ్న.

‘మా’ లో ఉన్న నటీనటులతో చిరంజీవికి ఉన్న అభిప్రాయ బేధాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. గతంలో మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన సీనియర్ నటుడు రాజశేఖర్, చిరంజీవి మధ్య గొడవ జరిగిన సంగతి‌ తెలిసిందే. ఆ సందర్భంగా ‘మా’లో తెరవెనుక జరుగుతున్న రాజకీయాలపై ఓపెన్‌గానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్. ఆయన వ్యవహార శైలిపై ఖంగుతిన్న మూవీ పెద్దలు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడగా.. అంత అవసరం లేదంటూ రాజశేఖరే తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి ‘మా’ నుండి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మా తరఫున కార్యక్రమాలు మందగించాయి.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి నేతృత్వో సిసిసి ఏర్పాటయింది. తామంతా విరాళాలు ఇచ్చి ఆ క్రెడిట్ మా కు‌ ఎందుకివ్వాలన్న ఉద్దేశం దీని వెనుక ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిరంజీవి నేరుగా రంగంలోకి దిగడంతో సిసిసికే అందరూ విరాళాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా ఏం చేస్తమదో చూడాలి. మా గొడవలు ఎలావున్నా కరోనాతో ఉపాధి కోల్పోయిన సినీరంగ కార్మికులను‌ ఆదుకోడానికి నటీనటులు ఉదారంగా విరాళాలు ఇవ్వడం ముదావహం.

ఇప్పటి వరకు సిసిసికి అందిన కొన్ని విరాళాలు

చిరంజీవి: కోటి రూపాయలు
నాగార్జున: కోటి రూపాయలు
దగ్గుబాటి కుటుంబం: కోటి రూపాయలు
తారక్‌: రూ.25 లక్షలు
మహేశ్‌బాబు: రూ.25 లక్షలు
రామ్‌చరణ్‌: రూ.30 లక్షలు
కార్తికేయ: రూ.2 లక్షలు
లావణ్య త్రిపాఠి: రూ.లక్ష
నాగచైతన్య: రూ.25 లక్షలు
వరుణ్‌ తేజ్‌: రూ.20 లక్షలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్: రూ.10 లక్షలు
శర్వానంద్‌: రూ.15 లక్షలు
విశ్వక్సేన్‌ :రూ.5 లక్షలు
రవితేజ :రూ.20 లక్షలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*