మేం చేస్తున్న మంచే మాకు శ్రీరామరక్ష – శ్రీకాళహస్తి అభివృద్ధికి భారీగా నిధులు : ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సహకారంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు రూ.200 కోట్లు మంజూరు అయ్యాయని,‌ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో సిమెంటు రోడ్లు , డ్రైనేజీ కాలువలు, సచివాలయాలు లింక్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని వేడాం, అరవకొత్తూరు, నిమ్మరాళ్ల పల్లి వద్ద లింక్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం నిమ్మరాళ్లపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ….శ్రీకాళహస్తి మండలంలో 30 సంవత్సరాలుగా ఎన్నో గ్రామాలు వెనకబడి ఉన్నాయని, తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి ఎవరు ఓట్లు వేస్తే వాళ్లకే రోడ్లు, సైడు కాలువలు ఇచ్చారని, ఈ ప్రభుత్వంలో అలా ఉండబోదని‌ అన్నారు. అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేస్తామన్నారు.
శ్రీకాళహస్తి మండలానికి ఏడు నెలల్లోనే 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని, అందులో 26 కోట్ల రూపాయలతో సచివాలయాలు, 40 కోట్ల రూపాయలతో మురికి కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యాన బీహెచ్ఈఎల్ వస్తే…2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే దాన్ని తరలించివేశారని అన్నారు. మండలంలో 350 ఎకరాల్లో అపాచీ కంపెనీ రానుందని, అలాగే ఎవరెస్ట్ అనే మరో కంపెనీ దాదాపు వెయ్యి ఎకరాల్లో ఏర్పాటవుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మన పొలాల్లో మూడు పంటలు పండే విధంగా ఎస్.ఎస్ కెనాల్ ను పూర్తి చేసి చూపిస్తాని హామీ ఇచ్చారు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మినిస్టర్ గా ఉన్న గోపాల్ రెడ్డికి శ్రీకాళహస్తి మండలం సమస్యలు కంటికి కనిపించలేదన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఇద్దరు పని మనుషులు ఉన్నారు…ఇందులో‌ఒకటి నేను, ఇంకోటి నా కూతురు.. మేమిద్దరం మీకు సేవ చేయడం కోసమే ఉన్నాం..మేము చేస్తున్న మంచే మాకు శ్రీరామరక్ష…అని మధుసూదన్ రెడ్డి‌ అన్నారు. ఈ సమావేశంలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఒక కోటి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

ఈ సమావేశంలో బర్రి హేమభూషణ్ రెడ్డి, వయ్యల కృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, చెంచయ్య నాయుడు, శంకరయ్య , మునిరామయ్య యాదవ్, వెంకటరమణ యాదవ్ ,శ్రీనివాసులు నాయుడు మరియు అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*