మోడీకి ఇరానీ గాజులు పంపుతుందా!

జమ్మూకాశ్మీర్‌లోని కథూవా, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఉదంతాలపై దేశ నలుమూలల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా కథువా దురాగతంపై స్పందించి. చిన్నారిని ఛిత్రవదచేసి చంపిన మానవ మృగాలను ఉరితీయాలన్నంత ఆగ్రహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అవసరం లేని విషయాల్లో గొంతుచించుకుని మాట్లాడే ప్రధాన మంత్రి… అవసరమైనపుడు పెదవి విప్పకుండా తెలివిగా దాటవేస్తుంటారు. అలాంటి మోడీ కూడా ఈ ఘటనలపై మాట్లాడాల్సివచ్చింది. జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు మంత్రుల రాజీనామా, ఉత్తర ప్రదేశ్‌లో ఎంఎల్‌ఏ అరెస్టు ఇవన్నీ పౌరసమాజం చేపట్టిన ఆందోళనల ఫలితమే. ఇదిలావుంటే…నెటిజన్లు కేంద్ర మంత్రి స్మ ృతి ఇరానీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినపుడు….స్మ ృతి ఇరానీ…అప్పటి ప్రధాన మన్మోహన్‌ సింగ్‌కు గాజులు పంపింది. ‘నువ్వే చేతగాని ప్రధాని’ అని చెప్పడం ఆమె ఉద్దేశం. (ఒక మహిళగా అలా గాజులు పంపడమంటే మహిళలను కించపరచడమే. అంటే గాజులు వేసుకునే మహిళలు చేతగానివారని ఆమె అభిప్రాయం). జమ్మూకాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి నాయకులు, ఎంఎల్‌ఏలు, మంత్రులే మహిళ పట్ల అమానుషంగా వ్యహరించిన నేపథ్యంలో….స్మ ృతి ఇరానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గాజులు పంపుతారా? పంపరా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే నెటిజన్లు చెబుతున్నట్లు ప్రధాని మోడీనికి పంపాల్సింది గాజులు కాదు…’మీరు ఈ దేశానికి పట్టిన చీడ…దిగిపోండి’ అనే సందేశాన్ని అని ఇంకొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*