మోడీకి మరోసారి ప్రకాష్‌రాజ్‌ చురకలు!

అవకాశం దొరకినపుడల్లా బిజెపిని, ఆపార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న విలక్షణ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చురకలు అంటించారు. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారుల సహాయ నిరాకరణకు నిరసనగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్ట్‌నెట్‌ గవర్నర్‌ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి దీక్ష కొనసాగుతున్నా కేంద్రం జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించమని ఐఎస్‌ఏ అధికారులకు ప్రధాన మంత్రి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ ప్రధానికి తనదైన శైలిలో చురకలు అంటించారు. ‘డియర్ సుప్రీం లీడర్‌..మీరు మీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌, యోగా, కసరత్తులతో బిజీగా ఉన్నారని తెలుసు. ఒక్క క్షణం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడండి. మంచి పని కోసం ధర్నా చేస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. మీరు కూడా మీ డ్యూటీ చేయండి’ అని ట్వీట్‌లో రాశారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*