మోడీపై బాబు నవ్వుల యుద్ధం!

రెండు రోజులుగా తెలుగు టివి ఛానళ్లలో ఓ వార్త హోరెత్తితోంది. ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం జరగబోతోందని, ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మోడీపై యుద్ధం ప్రకటించబోతున్నారని, ఇందుకోసం బిజెపియేతర ముఖ్యమంత్రులతో సంప్రదిస్తున్నారని, ప్రధాన ప్రసంగాన్ని బహిష్కరించే యోచనలో ఉన్నారని…ఇలా ఏవోవో అంశాలతో వార్తలు ఇచ్చారు. దీంతో ఆదివారం నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏమి జరగబోతోందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనికి తగినట్లుగానే శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న ముఖ్యంమంత్రి బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, కర్నాకట సిఎం కుమారస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ను కలిశారు. ఈ ఫొటోలు వేసి ఆదివారం నాటి పత్రికల్లో పెద్దపెద్ద వార్తలు రాశారు. కేంద్రంపై చంద్రబాబు ఆదివారమే తిరుగుబాటు ప్రకటిస్తారన్నంతగా రాశారు.

ఇంతకీ ఆదివారం ఢిల్లీలో ఏమి జరిగింది? ఈ సమావేశం నుంచి బయటకు వచ్చిన ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. మోడీ, చంద్రబాబు ఉల్లాసంగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చేతులు కలిపిన ‘అపురూప’ దృశ్యమది. బిజెపితో విడిపోయింది మొదలు ఆదివారం ఢిల్లీకి చేరేదాకా ముఖ్యమంత్రి బిజెపి పేరు చెప్పడం కంటే…మోడీ పేరు చెప్పి తీవ్రస్థాయిలో నిప్పులు కురిపించారు. మోడీకి భయపడేది లేదని పెద్ద స్వరంతో చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ఎలా వ్యవహరిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు ఇద్దరి మధ్యా మాటలు కూడా ఉండవేమో అని ఊహించుకున్నారు. అదేవిధంగా పత్రికల్లో, టివి ఛానళ్లలో వచ్చినట్లు ఈ సమావేశంలో చంద్రబాబు ఘీంకరిస్తారేమో అని భావించారు. అందరూ కాకున్నా చంద్రబాబు నాయుడైనా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వస్తారని అంచనా వేశారు. తీరా మోడీ, బాబు ఉల్లాసంగా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చేసరికి అందరూ ఖంగుతిన్నారు.

ఇక చంద్రబాబు నాయుడు 13 పేజీల తన ప్రసంగాన్ని 20 నిమిషాల్లో చదివి వినిపించారని కొందరు రాస్తే…ప్రభుత్వాన్ని నిలదీశారు అని కొందరు రాస్తున్నారు. నిలదీయడమంటే…. ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించడమా? ఆ విధంగా కూడా నిలదీయడం సాధ్యమా? బటయ సభల్లో వ్యక్తం చేసిన ఆగ్రహమే అక్కడా ఉండివుంటే….రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదాకా కదిలేది లేదంటూ సమావేశం మధ్యలో బైఠాయించివుండాలి. కనీసం తాను చెప్పాల్సింది చెప్పేసి వాకౌట్‌ చేసివుండాలి. అటాంటి పద్ధతులేవీ బాబు ఎంచుకోలేదు. ఇలా ఎందుకు చేశారనేది ప్రశ్న. ఏదైనా రాష్ట్ర హక్కులపై గట్టిగా గళం వినిపించడానికి దొరికిన గొప్ప వేదికను ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోలేకపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*