మోడీ చెప్పిన ముథోల్‌ కుక్కల గురించి తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కర్నాకట ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ముథోల్‌ కుక్కలను చూసైనా దేశభక్తి నేర్చుకోండి’ అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ముథోల్‌ శునకాలకు, దేశ భక్తికి సంబంధం ఏమిటి?

కర్నాటక రాష్ట్రం బాగల్‌ కోట్‌ జిల్లాలో ఉంది ముథోల్‌ ప్రాంతం. ఇక్కడి శునకాలకు ప్రత్యేకత ఉంది. ఇవి పొడవాటి మెడ, పొడవాటి మూతి, పెద్దదైన నోరు కలిగివుంటాయి. ఈ జాగిలాలు గత ఏడాది నుంచి భారత సైన్యంలో పని చేస్తున్నాయి. భారత సైన్యం జర్మన్‌ షెప్పర్డ్స్‌, స్వస్‌ పర్వత ప్రాంత జాగిలాల సేవలను వినియోగించుకునేది. 2017లో ముథోల్‌ నుంచి ఆరు శునకాలను ఎంపిక చేసుకుని శిక్షణ ఇచ్చారు. ఇవి దేశ సరిహద్దుల్లో సైనికులకు సహకరిస్తాయి. అప్పటిదాకా దేశీయ శునకాలను భారత సైన్యంలో వాడలేదు. మొదటిసారి ఆరు ముథోల్‌ జాగిలాలను తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం అవి భారత సైన్యంలో పని చేస్తున్నాయి. ముంథోల్‌ శునకాల్లోని ప్రత్యేక లక్షణాలను గుర్తించి వాటిని సైన్యంలోకి ఎంపిక చేశారు. ఇవి అంత స్నేహపూర్వకంగా ఉండవు. కొత్తవారిని దగ్గరకు రానీయవు. శిక్షణ ఇస్తే విశ్వాసంగా ఉంటాయి. ఇవి ఇళ్లలో కాపలాకు పనికిరావట. ఈ జాతి కుక్కలకు రోజూ వ్యాయామం అవసరం. అందుకే విశాలమైన ప్రదేశం అవసరం. వీటికి చికిత్స చేసేటప్పుడూ వాటితో చాలా మంచిగా మసులుకోవాలి. లేకుంటే క్రూరంగా ప్రవర్తిస్తాయి. 2005లోనే భారత ప్రభుత్వం ముథోల్‌ జాతి కుక్కల ఫొటోతో రూ.5 విలువైన పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఈ జాతి కుక్కలపై పరిశోధలకు కర్నాకటలో ప్రత్యేక కేంద్రానిన ఏర్పాటు చేశారు.

ఇదీ మోడీ చెప్పిన మూథోల్‌ కుక్కల కథ. ఈ జాతి కుక్కలు దేశానికి సేవలు అందిస్తున్నాయని, కాంగ్రెస్‌కు దేశ భక్తి అంటేనే పడదని ఆయన విమర్శించారు. రాజకీయాల కోసం సైన్యంలోని జాగిలాలనూ వదలకుండా వాటి ప్రస్తావన తీసుకురావడం న్యాయమా? అందులోనూ కుక్కలను చూసి నేర్చుకోమని చెప్పడం భావ్యమా? గతంలో అమిత్‌షా ప్రతిపక్షాలను కుక్కలు, నక్కలు, పురుగులు, పాములతో పోల్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేత వ్యక్తమయింది. ఇప్పుడు స్వయంగా ప్రధాని క్కుల ప్రస్తావన తెచ్చారు. ఇప్పటికే కర్నాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య…మోడీ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన మాటలను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. ఎవరైనా హుందాతనం కోల్పోకూడదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*