మోడీ సోషల్ మీడియాను నిషేధిస్తారా..!

ఈ ఆదివారం నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రధానమంత్రి నరేద్ర మోడీ తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద ఆలోచనే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో సోషల్ మీడియాను నిషేధిస్తారేమో అనే అనుమానాలు‌ వస్తున్నాయి.

ప్రధాని చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ…సోషల్ మీడియాకు కాదు..విద్వేష ప్రకటనలకు దూరంగా ఉండండి అని ట్వీట్ చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందిస్తూ…సోషల్ మీడియాను నిషేధించే ఆలోచనతోనే ప్రధాన మంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై నిషేధానికి తొలి‌ అడుగుగానే ఈచర్యను భావిస్తున్నానని ధరూర్ ట్విట్టర్ లో రాశారు.

మోదీకి ట్విట్టర్ లో 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్‌ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా చూస్తే ట్విట్టర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేతగా నరేంద్ర మోడీ ఉన్నారు. అటువంటిది ఆకస్మికంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

1 Comment

  1. మనదేశానికి సొంత సోషల్ మీడియా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published.


*