మోడీ x యోగి

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బిజెపిలో అద్వానీ సహా ఎందరో సీనియర్‌ నాయకులను పాతాలనాకి తొక్కేశారు. ఆయనే కొండలా పెరిగిపోయారు. తన ఎదుగుదలకు అడ్డొచ్చినవారు ఎంతటివారినైనా మోడీ ఉపేక్షించరని బిజెపి నాయకులే చెబుతుంటారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిపైన మోడీ దృష్టి పడిందట. ఆయన తనకు పోటీగా తయారవుతున్నాడన్న భావనతో…అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారట.

ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తరువాత…. అనూహ్యంగా యోగీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌. అప్పటిదాకా యోగీ ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి అవుతూనే…ఆయన గురించి కథలు కథలుగా మీడియ ప్రచారం చేసింది. నరేంద్ర మోడీనికి దీటైన నాయకుడిగానూ చెప్పారు. ఇదలావుంచితే…ఇటీవల కాలంలో మోడీకి ప్రభ తగ్గుతోంది. దేశ వ్యాపితంగా ఆయనకు వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉంటే చాలా ప్రాంతాయ పార్టీలు బిజెపికి దూరం అవుతారన్న సంకేతాలు ఆర్‌ఎస్‌ఎస్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో యోగీని ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి తెస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ కన్నెర్రజేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమిని అడ్డంపెట్టుకుని ఇప్పటికే యోగీకి చెక్‌పెట్టారు. అక్కడ ఓటమికి యోగీనే కారణమన్నట్లు మోడీ, షా మాట్లాడారట. అయితే…యోగీ మాత్రం, తన ప్రమేయం లేకుండా మోడీనే అభ్యర్థిని ఖరారు చేయడం వల్ల ఓటమిపాలు అయ్యామని వాదిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కర్నాకట ఎన్నికల ప్రచారానికి యోగీని దూరంగా పెట్టేశార మోడీ. యోగీపై అణచివేత చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ విభేదాలు ఎన్నికలు సమీపించే కొద్దీ బహిర్గతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*