యడ్యూరప్పా..అంత బడాయివొద్దప్పా!

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌ మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకే మొగ్గువుంటుందని సర్వేలు చెబుతున్నాయి. బిజెపికి తీవ్రమైన పరాభవం తెప్పదన్న వార్తలూ వాస్తున్నాయి. అయితే….ఒకవైపు పోలింగ్‌ జరుగుతుండగానే….బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప తాను ఈనెల 17న ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని, ఈ ఉత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తానని చెప్పారు. తమ పార్టీకి 145 నుంచి 150 స్థానాలు వస్తాయని ప్రకటించారు. మూడు రోజుల్లో ఫలితాలు ఎటూవస్తాయి. అంతలోనే ఇంత బడాయి ఎందుకో? 2008లో బిజెపి తరపున యడ్యూరప్ప కర్నాకట ముఖ్యమంత్రి అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2011లో పదవి నుంచి వైదొలిగారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రచారం చేసింది. యడ్యూరప్పపై ఉన్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి నష్టం చేకూర్చుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఇవేవీ పట్టని ఆయన మాత్రం తన ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటించేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*