‘రంగస్థలం’కు అంత సీనుందా!

Rangasthalam Movie Stills Starring Ram Charan

సినిమా వాళ్లు సాధారణంగా ఎక్కువగా స్పందిస్తుంటారు. సినిమా ప్రీ రిలీజ్‌, సక్సెస్‌ మీట్‌లలో హీరోలను, దర్శకులను ఆకాశానికెత్తూస్తూవుంటారు. అది ఎలాంటి సినిమా అయినా సూపర్‌ డూపర్‌ అంటూ పొగిడిస్తూవుంటారు. ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అలా చెప్పడంలో తప్పులేదుగానీ…ఏ సినిమా స్టామినా ఎంతో సరిగా సినిమా నిపుణులు అంచనా వేయగలగాలి. లేకుంటే పప్పులో కాలేస్తారు.

చిరంజీవి తనయుడు రాంచరణ్‌ నటించిన రంగస్థలం సినిమాకు మంచి ఆదరణే లభిస్తోంది. 1980 దశకం నాటి గ్రామీణ పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ ఉత్సవానికి అతిథిగా విచ్చేసిన రాంచరణ్‌ బాబాయి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ….రంగస్థలం సినిమాను ఆస్కార్‌ అవార్డు కోసం పోటకి పంపాలని, అలా పంపకుంటే సినిమాకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. తన అన్నకుమారుడైన రాంచరణ్‌పై ప్రేమ ఉంటేవుండొచ్చుగానీ… రంగస్థలం సినిమాకు ఆస్కార్‌ అంత సీనువుందా? అనేది ప్రశ్న.

మూస, వ్యాపార పద్దతికి భిన్నంగా వచ్చిన రంగస్థలం మంచి సినిమానేగానీ…ఆస్కార్‌ అంత ఎత్తుకుదాన్ని ఎత్తడం తగదన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. వాస్తవంగా గతంలో రంగస్థలం సినిమాను మించిన చిత్రాలు ఎన్నో వచ్చాయి. అంతెందుకు ఆ మధ్య అనంతపురం అనే సినిమా 1980 నాటి పరిస్థితుల నేపథ్యంగానే వచ్చింది. ప్రముఖ నటులు అందులో లేరుకాబట్టి దానికి అంత ప్రచారం లభించలేదు. ఆ మాటకొస్తే రంగస్థలం సినిమా 1080 దశకం నాటి గ్రామీణ రాజకీయ, సామాజిక వాతావరణాన్ని అంతగా ప్రతిబింబిం చలేదనే చెప్పాలి. టూరింగ్‌ టాకీస్‌ సీను లేకుండా ఆనాటి సాంస్కృతిక జీవనం లేదు. అటువంటి మేజర్‌ అంశాన్ని సుకుమార్‌ మిస్‌ చేశారు. సునిశితంగా చెప్పాలంటే అనేక అంశాలున్నాయి. నటీనటుల ఆహార్యంతోనే రంగస్థలంను నెట్టుకొచ్చారు. ఎడారిలో ఆముదపు వృక్షంగా రంగస్థలానికి ఆదరణ లభిస్తోంది. అంతమాత్రాన్ని దాన్ని ఆస్కార్‌ స్థాయికి ఎత్తేయడం సరైనది కాదేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*