రంగుల రాజకీయానికి ఆది గురువు చంద్రబాబే..!

ప్రభుత్వ కార్యాయాలకు వేసిన వైసిపి రంగును తక్షణం తొగించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. రంగుల వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకు, మళ్లీ అక్కడి నుంచి హైకోర్టుకు, తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత తుది తీర్పు వెలువడింది. ఎవరి అభిప్రాయాలు ఎలావున్నా న్యాయస్థానాల తీర్పును శిరసా వహించాల్సిందే. ప్రభుత్వం రంగులు మార్చాల్సిందే.

ప్రభుత్వ కార్యాయాలకు రంగు మార్చాల్సిరావడం వల్ల రూ.1300 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని, ఈ మొత్తాన్ని జగన్‌ నుంచి వసూలు చేయాని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

వాస్తవంగా చెప్పాంటే రంగుల రాజకీయానికి ఆది గురువు చంద్రబాబే అని చెప్పాలి. చిన్న ఉదాహరణ వివరిస్తాను. 2014 ఎన్నికలకు ముందు ఆర్‌టిసి ఆర్డినరీ బస్సులకు ‘పల్లె వెలుగు’ అని మంచి పేరుపెట్టి, దానికి ఆకుపచ్చ, తెపులు రంగు వేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుకు పల్లె వెలుగు అని పేరు పెట్టడం ఎంతో సమంజసంగా, అతనికినట్లు ఉంది.

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే…ఈ బస్సులకు ‘తెలుగు వెలుగు’ అని పేరు మార్చారు. అంతేకాదు రంగు కూడా మార్చారు. పచ్చరంగు స్థానంలో పసుపు రంగు వేశారు. అంటే రంగుతో పాటు పేరులోనూ తమ పార్టీ పేరు కనిపించేలా, వినిపించేలా మార్పు చేశారన్నమాట.

ఇక ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి జరిగినా…. వేదికను, ప్రాంగణాన్ని పసుపుమయం చేసేవాళ్లు. పార్టీ సభలకు, ప్రభుత్వ సభలకూ తేడా లేకుండా నిర్వహించేవాళ్లు.

రోడ్డు పక్కన కనిపించే ప్రతి బస్టాపునకూ పసుపు రంగే. నీళ్ల ట్యాంకుకూ పసుపు రంగే. శ్మశాన వాటికూ పసుపు రంగే. పాఠశాల ప్రహరీకీ పసుపు రంగే. మహిళలకు కుట్టుమిషన్లు ఇస్తే పసుపు రంగే. రేషన్‌ కార్డులిస్తే పసుపు రంగే. అన్నా క్యాంటీన్లకూ పసుపు రంగే. ఆఖరికి రోడ్డు డివైడర్లకూ పసుపు రంగే. ఇప్పటికీ చాలా నిర్మాణాలకు పసుపు రంగు అలాగే వున్నాయి.

ఈ పరస్థితుల్లో చెప్పేదేమంటే…రంగు రాజకీయం జగన్‌తో మొదలు కాలేదు. రంగులనూ రాజకీయానికి వాడుకోవడం చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆయన్ను చూసే ఇతరులూ నేర్చుకున్నారని అనుకోవాలి. అందుకే గతంలో రంగులు మార్చడానికి అయిన ఖర్చును చంద్రబాబు చెల్లించాని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

శ్మశానవాటిక ముఖద్వారానికి పసుపురంగు వేసిన దృశ్యం

ఇక ఈ రంగు విషయంలో చెప్పుకోవా ల్సిందేమంటే…. రంగులతో ప్రజలు రాజకీయంగా ప్రభావితం అవుతారను కోవడం ఒట్టి భ్రమ. 2014 ఎన్నికలకు ముందు ఎక్కడ చూసినా పసుపు రంగే. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు చిత్తుగా ఓడిపోయిందీ? అందుకే ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. డబ్బు పోయినా విమర్శలకు తావులేని విధంగా రంగులు వేయాలి. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రంగులతో రాజకీయం చేయడానికి అవకాశం లేని విధంగా నిర్ణయం తీసుకోవాలి. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*