రజనీకాంత్‌, నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాష్‌….ఆ పార్టీలో చేరబోతున్నారట..!

తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు ఓ ఆసక్తికరమైన వ్యక్తి వచ్చారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన పేరు రాటకొండ సుబ్రమణ్యం. తనను తాను పరిచయం చేసుకుంటూ తాను జర్మనీలో ఉంటానని, 20 రోజుల క్రితమే తిరుపతికి వచ్చానని చెప్పారు. దేశాన్ని బాగు చేయడం కోసం ఓ జాతీయ పార్ఠీని స్థాపించబోతున్నట్లు చెప్పారు. ఆంగ్లం అనర్గలంగా మాట్లాడుతున్న ఆయన ఆరేడు పేజీల నోట్‌ తయారు చేసుకొచ్చారు. అందులోని విషయాలను చూసిన పాత్రికేయులకు మతిపోయింది. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్‌ అకౌంట్‌ చూడమని చెప్పారు. అందులోని విషయాలు చూస్తే దిమ్మతిరిగింది.

తాను ప్రారంభించబోయే పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారో నోట్‌లో వివరించారు ఆయన. ఫలానా రాష్ట్రానికి ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గద్దర్‌, ఆంధ్రప్రదేశ్‌కు నటుడు శివాజీ, తమిళనాడుకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కేరళకు మమ్మూటి….అలా దేశంలోని అని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులను నిర్ణయించేశారు ఆయన.

అంతేకాదు…ఎంపిలుగా ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో కూడా తన ట్విట్టర్‌లో రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జెడి లక్ష్మీనారాయణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, జగపతిబాబు, శరత్‌బాబు, మహేష్‌బాబు, ప్రభాష్‌…వీరంతా ఎంపి అభ్యర్థులట. ఈ విధంగా తనకు తెలిసిన ప్రముఖల వివరాలన్నీ వికీపీడియా నుంచి సేకరించి, ప్రెస్‌నోట్‌లో పొందుపరచి పాత్రికేయులకు అందజేశారు.

ఇంతకీ….ఈ అందరితో మాట్లాడారా? అంటే మాట్లాడానని, అందరూ తన పార్టీలో చేరడానికి అంగీకరించారని, త్వరలో కొందరు ప్రముఖులను తీసుకుని ప్రెస్‌మీట్‌కు వస్తానని చెప్పారు. ఇతంతా చేస్తున్న తనపై ప్రభుత్వం కక్షగట్టిందని, ప్రభుత్వం నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని చెప్పకొచ్చారు ఆ రాటకొండ సుబ్రమణ్యం. ఏమైతేనేమి…దేశంలోని సినీ ప్రముఖులందరితో కలిపి ఓ పార్టీ పెట్టాశారు ఆ మహానుభావుడు. ఇక పోటీనే మిగిలింది.! హాఁ హాఁ హాఁ..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*