రమణదీక్షితులుపై దావాకు టిటిడి సన్నద్ధం!

గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సంచలనంగా మారిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పరువునష్టం దావా వేయడానికి టిటిడి సన్నద్ధం అవుతోంది. అదేవిధంగా తరచూ గళం విప్పుతున్న టిటిడి మాజీ ఈవో ఐవైఆర్ కృష్షారావుకు నోటీసులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టిటిడి పాలక మండలి సమావేశం అనంతరం ఈవో అనిల్ కుమార్ సింగాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘టిటిడిపై ఆరోపణలు చేస్తున్నవారికి పరువునష్టం కేసులు, క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించమని టిటిడి న్యాయ అధికారికి సూచించాం. రెండుమూడు రోజుల్లో కేసులపై తుది నిర్ణయం తీసుకుంటాం.’ అని చెప్పారు.

అయితే..రమణ దీక్షితులుపై కేసులు పెట్టాలని ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని, అయితే ఏసెక్షన్ల కింద కేసుపెట్టాలు, పరువునష్టం ఎంతకు చేయాలి అనే అంశాలను మాత్రమే తేల్చాల్సివుందని తెలుస్తోంది. మొత్తంమ్మీద రమణ దీక్షితులుపై చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించడానికి టిటిడి సిద్ధమయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*