రమణదీక్షితులు గెంటివేత!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టిటిడి .అధికారులపైన, ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపైన తీవ్ర విమర్శలు గుప్పించి 24 గంటలు గడవక మునుపే ఆయనఁ ఉద్వాసన పలికి ఇంటిదారి పట్టించేలా నిర్ణయం తీకున్నారు. టిటిడిలో పఁ చేస్తే ఆర్చఁల్లో 65 ఏళ్లు పైబడిన వారిఁ రిటైర్‌మెంట్‌ చేయాలఁ బుధవారం తిరుపమలలో జరిగిన ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితులు కూడా ఇంటిముఖం పట్టనున్నారు. రమణ దీక్షితులు కోసమే….ఈ నిర్ణయం తీసుఁన్నారా అఁపించేలా ఉంది టిటిడి తీసుఁన్న నిర్ణయం. శ్రీవారికి శతాబ్దాలుగా భక్తులు సమర్పించిన ఆభరణాలకు లెక్కకలు లేవని, అభివృద్ధి పేరుతో పురాతన కట్టడమైన శ్రీవారి ఆలయాన్ని నాశనం చేస్తున్నారఁ, దీఁపైన సిబిఐ విచారణ జరిపించాలఁ రమణ దీక్షితులు విమర్శలు చేశారు. ఈ అంశాలపై ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరిగిన టిటిడి పాలక మండలి సమావేశంలో 65 ఏళ్లు పైబడిన అర్చనిలను రిటైర్‌మెంట్‌ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రమణ దీక్షితులు వయసు 70 ఏళ్లు. ఈ నిర్ణయం ఆయనకూ వర్తిస్తుందా అఁ విలేకరులు అడగ్గా…నిర్ణయం చేశాక ఎవరికైనా వర్తిస్తుందని ఈవో చెప్పారు. అంటే రమణ దీక్షితులు ప్రధాన అర్చకత్వం పోస్టే కాదు…ఇక శ్రీవారి ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశమే ఉండదు. ఈ నిర్ణయం తీవ్ర దుమారం రేపే సూచనలు కఁపిస్తున్నాయి.

అర్చకులను విభజించి…

తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చఁల సంఖ్య సరిపోవడం లేదఁ, తమ కుటుంబాల్లోని వారిని తీసుకోవాలని అర్చకులు చాలాకాలంగా కోరుతూవస్తున్నారు. ఇప్పటిదాకా దాఁ గురించి పట్టించుకోఁ టిటిడి…ఆకస్మికంగా ఆ అంశాన్ని అజెండాగా తీసుఁఁ చర్చించింది. కొత్త అర్చఁలు ఉద్యోగాలు ఇవ్వమంటే వయసు మీరిందనే పేరుతో కొందరిఁ తొలగించడాఁకి తీర్మాఁంచారు. 65 ఏళ్ల వయసు నిండిన వారిని తొలగిస్తే కొత్త వారికి ఉద్యోగాలు వస్తాయఁ ఆశ చూపడంతో…కొందరు అర్చఁలు ఈ మేరఁ ఈవోఁ వినతిపత్రం సమర్పించారు. అ వినతిపత్రం వచ్చిందే తడువుగా 65 ఏళ్లుండిన వారిని తొలగించాల నిర్ణయం తీసుఁన్నారు. ఈ నిర్ణయంతో ముందుగా ప్రభావితమయ్యేది రమణ దీక్షితులే. ఆయన్ను ఇంటికి సాగనంపడం కోసమే ఆఘమేఘాలపై అర్చఁల అంశాన్ని చర్చించారన్న విమర్శలు వస్తున్నాయి.

సన్నిధి గొల్ల విషయంలో రివర్స్‌

సన్నధి గొల్లగా పఁ చేస్తున్న పద్మనాభయ్యను ఇదే విధంగా రెండేళ్ల క్రితం రిటైర్‌మెంట్‌ చేస్తే రాష్ట్ర వ్యాపితంగా సన్నిధి గొల్లలు ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుఁన్నారు. సఁ్నధి గొల్ల అనేది ఉద్యోగం కాదఁ, అది వంశపారపర్యంగా వస్తున్న ఒక బాధ్యత అని, అలాంటి పనికి రిటైర్‌మెంట్‌ ఏమిటఁ యాదవ సంఘాలు ప్రశ్నించాయి. రిటైర్‌మెంట్‌ లేదు…లేదు అంటూ పద్మనాభయ్యను కొనసాగించారు. అర్చకులూ అదే వాదిస్తున్నారు. తాము ఉద్యోగులం కాదఁ, అర్చకత్వం వంపపారంపర్యంగా వస్తున్న హక్కు అఁ వాదిస్తున్నారు. మిరాశీ అర్చఁలు ఈ మేరఁ సుప్రీం కోర్టులో కేసు నడిపిస్తున్నారు. వాస్తవంగా అర్చకులు టిటిడి ఉద్యోగులు కారు. అయినా 65 ఏళ్లు నిండాయన్న పేరుతో వారిని తొలగిస్తున్నారు. ఆ స్థానంలో అదే వంశీఁలను నియమించాలన్న నిబంధన ఏమీ లేదఁ కూడా టిటిడి వాదిస్తోంది. టిటిడి ఈవో చెప్పిన ప్రకారం సన్నిధి గొల్ల కూడా వంశపారంపర్య విధి కాదు. ఆ పోస్టులో ఎవరినైనా టిటిడి నియమించుకోవచ్చు. ఈ మాటను టిటిడి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలోనే చెప్పడం విశేషం.

రాజకీయ రంగు
రమణ దీక్షితులు వెనుక బిజెపి ఉందఁ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయఁండా, 24 గంటల్లో ఆయనఁ ఉద్వాసన చెప్పేలా ఁర్ణయం తీసుఁన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తిరుమల, టిటిడి కేంద్రంగా రాబోయే కాలంలో తీవ్రమైన వివాదాలు తలెత్తే సూచనలు కఁపిస్తున్నాయి. టిటిడి ఁర్ణయంపై రమణ దీక్షితులు, మిగతా అర్చఁలు కోర్టును ఆశ్రయించే అవకాశముంది. దీక్షితులు డిమాండ్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*