రమణ దీక్షితులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు భయపడుతున్నారా?

టిటిడిపై తీవ్రవిమర్శలు చేస్తూ దేశ వ్యాపితంగా సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదం మొదలైనప్పటి నుంచి బయట రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. తిరుమలకు, తిరుపతికి అసలు రావడం లేదు. ఈనెల 14వ తేదీ ఆయన చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించి….బాంబులు పేల్చారు. 16వ తిరుమలలో బోర్డు సమావేశం జరిగింది. ఆయన్ను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 17వ తేదీ ఉదయం తిరుమలలో కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అప్పటి నుంచి మళ్లీ ఆయన తిరుమలలో కనిపించలేదు. తొలగింపు నోటీసులు కూడా గోడకు అంంటించారు టిటిడి అధికారులు. ఒక రోజు ఢిల్లీలో కనిపించారు. ఇంకో రోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. చెన్నైలో ఉంటున్నారని, హైదరాబాద్‌లో ఉన్నారని, ఢిల్లీలో ఉన్నారని చెబుతున్నారు తప్ప….కచ్చితంగా ఆయన ఎక్కుడున్నదీ తెలియడం లేదు. టివిల్లో మాత్రం కనిపిస్తున్నారు. అదీ జాయతీ మీడియాలో కనిపిస్తున్నారు. అనేక అంశాలపైన ఆయన స్పందన తీసుకోడానికి, అనేక అనుమానాలను నివృత్తి చేసుకోడానికి, తిరుమల, తిరుపతిలోని మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంగానీ, ఎవరో తీసి కట్‌ చేయడంగానీ చేస్తున్నారు.

ఇంతకూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు ఆయన భయపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల మీడియాపై విశ్వాసం లేక బయట ప్రాంతాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దీక్షితులు చెబుతున్నారు. మీడియాతో మాట్లాడకపోవచ్చు….కనీసం తిరుమలలోని ఇంటికి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదైనా కేసులు బనాయించి తనను అరెస్టు చేస్తుందన్న అనుమానం ఆయనలో ఉందా? అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నారా? సుప్రీం కోర్టు ఏదోఒక ఉత్తర్వు ఇచ్చేదాకా ఆయన తిరుమలకు రారా? ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న టిటిడి ఈవో అనిల్ కుమార్ సిఘాల్, ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. టిటిడిపై విమర్శలు చేసేవారిపైన కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈవో చెప్పారు. ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి వస్తుందని రమణ దీక్షితులు ముందుగానే అంచనా వేసినట్లున్నారు. అందుకే బయట రాష్ట్రాల్లో తిష్టవేశారు. మన పోలీసులు ఇతర రాష్ట్రాలోకి వెళ్లి అరెస్టు చేయడం అంత తేలికకాదు. సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తుందన్న గట్టి నమ్మకంతో దీక్షితులు ఉన్నారు. అదే విధంగా తన తొలగింపునూ రద్దు చేస్తుందని నమ్ముతున్నారు. ఈ రెండు జరిగాకే ఆయన తిరుపతికి వచ్చే అవకాశాలున్నాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*