రమణ దీక్షితులు ఆరోపణలతో…టిటిడి ప్రతిష్ట మసకబారుతుందని వాదిస్తున్నవారి కోసమే…

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టిటిడిలో జరుగుతున్న అక్రమాలపై ఆరోపణలు చేస్తుంటే…కొందరు టిటిడి ప్రతిష్ట మసకబారుతోందని గగ్గోలు పెడుతున్నారు. రమణ దీక్షితులు ఆరోపణలు ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి వారు ఆలోచించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

– తిరుమల తిరుపతి దేవస్థానంలో 8,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు పని చేస్తుంటే…అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులుగా దాదాపు 14 వేల మంది పని చేస్తున్నారు. ఇందులో సులభ్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులే 3 వేల మంది ఉన్నారు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు లేకుంటే….టిటిడిలో పాలనే లేదు. అలాంటి కార్మికుల శ్రమను సంవత్సరాల తరబడి దోచుకుంటున్నారు. ఒక్కో కార్మికునికి సగటున రూ.7000కు మించి జీతం రావడం లేదు. ఇలాంటివారు తిరుపతి నగరంలో అద్దె ఇంట్లో ఉంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని చదవించుకుంటూ బతకడం సాధ్యమా?

– ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికు వేతనాలు పెంచుతూ జీవెఓ 151 విడుదల చేసింది. దాన్ని అమలు చేస్తే కిందిస్థాయిలోని కార్మికునికి రూ12,000 వేతనం వస్తుంది. జీవో వచ్చి ఒకటిన్నర ఏడాది అవుతున్నా ఇప్పటిదాకా పట్టించుకున్నవారు లేరు. ముఖ్యమంత్రిని అడిగితే…’టిటిడి ఆదాయ వ్యయాలు చూసుకుని వేతనాలు పెంచాలి’ అని అన్నారు. రూ.3000 కోట్లు వార్షిక బడ్జెట్‌ ఉన్న టిటిడిలో కార్మికుల వేతనాలు పెంచడం పెద్ద సమస్య కాదు. జీతాలు పెంచరుగానీ హిందూ ధర్మపరిరక్షణ పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సంస్థలో పనిచేసే కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే వారిని ఆదుకోవడం ధర్మ ప్రచారం కాదా?

– ప్రభుత్వం పేదలకు తీర్థయాత్రలు కల్పించే పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి టిటిడి నిధులు ఇవ్వాలట. దీనికి కోట్లు ఖర్చవుతున్నాయి. టిటిడిలో డబ్బులు లేకుంటే….ఇలాంటి యాత్రలకు నిధులు ఎందుకు ఇవ్వాలి?

– ఆలయాల నిర్మాణం పేరుతో, మరమ్మతుల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పురాతన ఆలయాలను మాత్రమే పునర్‌ నిర్మించాలన్న నిబంధన ఉన్నా….ఎంఎల్‌ఏలు ప్రభుత్వానికి లేఖలు రాస్తే, ఆ లేఖ టిటిడికి వస్తే, టిటిడి నిధులు ఇస్తోంది. కార్మికుల వేతనాలు పెంచడానికి మాత్రం నిధులు లేవని అబద్ధం చెబుతారు.

– లగేజీ కేంద్రాల్లోనో, చెప్పుల కేంద్రాల్లోనో పనిచేసే ఒక కార్మికుడు రూ.2 తీసుకుంటే…దానికి విజిలెన్స్‌్‌ విచారణలు జరిపి, అతని కడుపుకొట్టి ఇంటికి పంపేస్తున్నారు. మరి వందల కోట్లు కొల్లగండుతున్నారని చెబుతున్న అధికారులపై విచారణ వొద్దా?

– అంతెందుకు….శ్రీ‌వారికి నిత్యం ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌యారు చేసే బ్రాహ్మ‌ణుల (కార్మికులు)కు ఇస్తున్న వేత‌నాలు ఎంత‌? నిగ‌నిగ‌లాడే బూందీ పొయ్యిల వ‌ద్ద బ్రాహ్మ‌ణుల ఒంటి నుంచి ఒక‌వైపు స్వేదం చిందుతుంటే..మ‌రోవైపు కంటి నుంచి ర‌క్తం కారుతుంటుంది. ఇదేనా ధ‌ర్మం? ఇలావున్నా అంతా బాగున్న‌ట్లేనా.?

ఇటీవ‌లే క‌ల్యాణ‌క‌ట్ట‌లో రూ.10 చిల్ల‌ర తీసుకున్నార‌ని సిసి కెమెరాలు పెట్టి 400 మందిని తొల‌గించారే. మ‌రి రూ.10ల‌కే అంత శిక్ష అయితే…కోట్టు కొ్ల్ల‌గొట్టిన వారికి వవ‌స‌రం లేదా?

– ఇటీవలే ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేయలేదన్న కారణంతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరి ఆలయ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలనే మంటగలిపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నవారిపై విచారణ అవసరం లేదా?

– బ్రేక్‌ దర్శనాల టికెట్ల పేరుతో భారీ అవినీతి జరుగుతున్నట్లు రోజూ వార్తలొస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి పారదర్శకత అవసరం లేదా? రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదు? ఇది ఆలయానికి మర్యాదా? శ్రీవారిని పవిత్రంగా చూస్తున్నట్లా?

– నిజాయితీ అధికారులెవరులను ఇక్కడ పని చేయనీయరు. తాను పనిచేసిన అనేక చోట్ల ప్రశంసలు అందుకున్న ఎస్‌పి రవికృష్ణను ఎనిమిది నెలలకే సివిఎస్‌వో పోస్టు నుంచి తప్పించారు? ఎందుకు? ఆయన చేసిన నేరం ఏమిటి? ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోవాలా?

– మాజీ ఈవో సాంబశివరావు అద్భుతమైన పనితీరును కనబరిచారు. దీంతో ప్రభుత్వానికీ మంచి పేరు వచ్చింది. మరి ఆయన్ను అవమానకర రీతిలో ఎందుకు బదిలీ చేశారు? దీనిపైన విచారణ అవసరం లేదా?

ఒకటికాదు రెండు కాదు…ఇలాంటి ఉదాహరణలు అనేకం చెప్పవచ్చు. ఆలయ సంప్రదాయాలకు సంబంధం లేని అంశమైనా సమాచార హక్కు చట్టం కింద సమారం అడిగితే ఇవ్వరు. అంతా రహస్యం అంటారు. ఇది ఎందుకు రహస్యం అవుతుంది? ఆధ్యాత్మిక సంస్థలో రహస్యాలు ఏమిటి? ఇంతకీ ఏదో ఒక సంస్థ విచారణ జరిపిస్తే….జరిగే నష్టం ఏమిటి? ఇలాంటివన్నీ నిగ్గుతేల్చితే టిటిడి ప్రతిష్ట మసకబారుతుందా? మరింతగా ప్రభవిస్తుందా? అందరూ ఈ అంశాలపై ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్యం…రమణ దీక్షితులు లేవనెత్తుతున్న అంశాలపై మాత్రమే కాదు….కాంట్రాక్టర్ల వ్యవస్థ నుంచి టికెట్ల దాకా అన్నింటిపైనా సమగ్ర విచారణ జరగాల్సిన సమయం ఆసన్నమయింది. ర‌మ‌ణ దీక్షితులు ఈ అంశాల‌పైనా మాట్లాడాలి.

3 Comments

  1. Ohm Namo Venkatesaya

    It is true that the organisation is performing mostly by the direct contribution of all out sourcing employees whose salary is being overlooked by the TTD and also by the govt.

    Atleat, they are not getting wages as per central minimum wages thereby few of them are becoming source of illegal activities of cheating devotees with additional offerings, spoiling sacredness. To over come this, strict discipline action to be taken against them at the same time the wage structure should be made up as per class A category rates of Labour Act.

    This will not only a positive action towards safe guarding TTD sanctity but also raise the fear of loosing jod, faith and Bhakthi on the Lord among the workers/ helpers.

Leave a Reply

Your email address will not be published.


*