రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై సమగ్ర విచారణ జరగాలి

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానా అర్చకులలో ఒకరైన రమణదీక్షితులు చెన్నైలో విలేకర్ల సమావేశం నిర్వహించి తిరుమల ఆలయవ్యవహరాలకు సంబందించి కీలకమైన ఆరోపనలు చేసినారు. వారి వెనక కేంద్రపెద్దల హస్తం ఉందని రాజకీయ ఆరోపనలు , వారి వ్యవహర శైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికి ప్రధాన అర్చకుడు కావడం, చేసిన ఆరోపనలు ఆందోళన కలిగించేవిగా ఉండటం వలన శ్రీవారి బక్తులలో అనుమానాలకు, ఆందోళనలకు అవకాశం ఉంది కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపించాలి. వారి వెనక దాగి ఉన్న ఉద్యేశాలపై కాకుండా వారు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలి.

రమణదీక్షిలు ప్రదానంగా లేవనెత్తిన అంశాలు 1. ఆభరణాల నిర్వహణ 2. పూజాది కార్యక్రమాల నిర్వహణలో అధికారుల జోక్యం. 3. చారిత్రక నిర్మాణమైన శ్రీవారి ఆలయం చుట్టూ అవసరాలపేరుతో మార్పులు 4. అర్చకుల విదులలో అధికారుల జోక్యం, మిరాశీ విదానం. లాంటివి ప్రదానమైనవి. బిన్నాబిప్రాయాలు ఉన్నా వారు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చ జరగాలి.

ఆభరణాల నిర్వహణ…..

శ్రీవారి ఆభరణాల నిర్వహణ అత్యంత లోపభూయిస్టంగా ఉంది. కనీస జవాబుదారితనం లేదు అని చెప్పక తప్పదు. రాజరికంలో రాజు ఇష్టం అన్నట్లుగా ఈ వ్యవహరం ఉంది. వేల కోట్ల రూపాయిల సంపద, రాజులకాలంలో శ్రీవారికి ఇచ్చిన విలువైన ఆభరణాలు కూడా ఉండటం వలన వాటికి చారిత్రక ప్రాదాన్యత ఉంది. శ్రీక్రిష్ణదేవరాయుల కాలం నుంచి ఆదునిక ప్రముకులు సమర్పించిన ఆభరణాలు ఉన్నాయి అందులో ఉన్నాయి. అంతటి ప్రాదాన్యత కలిగిన విలువైన సంపదను ఒక రిటైర్ తాత్కాలిక ప్రత్యేక అధికారి పేరుతో పనిచేస్తున్న వ్యక్తికి అప్పంగించారు. వారి దయ ప్రజల ప్రాప్తం అన్నట్లుగా వ్యవహరం నడుస్తుంది. శ్రీవారి నగలను పర్యవేక్షణతో బాటూ రోజూవారి తనికీ చేయడానికి అప్రజైరీ కమిటి ఉంది. వీరు నిత్యం ఆభరణాలను తనికీ చేస్తూ రిజిస్టర్ లో సంతకం చేయాలి. ఒక సందర్బంలో ఈ కమిటీ సభ్యులు ఒకరు తాము సంతకం పెట్టడం తప్ప చూసింది ఏనాడూ లేదు. అని పరోక్షంగా మాట్లాడినారు అంటే పరిస్దితిని అర్దిం చేసుకోవచ్చు. అందుకే మాలాంటి వారు మొదటి నుంచి చెపుతున్నది నిత్యం ఆభరణాలను ప్రజల సందర్సనకు ఉంచాలని. ఒక దశలో ఆభరణాలను తిరుపతిలో ప్రజల సందర్సనకు ఉంచుతున్నట్లు ప్రకటించి ముందురోజు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. కారణం ఆభరణాల బద్రతకు బరోషా లేదని. ఒక తాత్కలిక ఉద్యోగి చేతిలో బద్రత ఉంటుంది గానీ వ్యవస్దచేతిలో బద్రత లేదు అనడం కన్నా విచిత్రం ఏమి ఉంటుంది. ఆభరణాలను ప్రజల సందర్సనకు ఉంచితే నిర్వహణదారులకు బయం ఉంటుంది. శ్రీవారి బక్తులకు స్వామివారి ఆభరణాలను చూసినాము అన్న సంతృప్తి మిగలడమే కాదు శ్రీవారికి సమర్పించిన విలువైన ఆభరణాలను ఎవరు సమర్పించినారో తెలియపరుస్తారు కాబట్టి అవకాశం ఉన్న శ్రీవారి భక్తులు తాముకూడా శ్రీవారికి ఆభరణాలు సమర్పిస్దే ఇలాంటి గౌరవం లబిస్తుందన్న ఉద్యేశంతో శ్రీవారికి కానుకలు సమర్పించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. కానీ పాలకులు ఆ వైపుగై అడుగులు వేయడం లేదు.

చారిత్రక నిర్మాణంలో ఇస్టానుసారం మార్పులు- పురావస్తు శాఖపవ్యవహరం….

శ్రీవారి ఆలయానికి 12 వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. విజయనగర, చోలరాజులు నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయి. వాటిని బావితరాలకు బద్రంగా అందించడం నేటి తరం బాద్యత. కానీ తిరుమల విషయంలో అందుకు బిన్నంగా వ్యవహరాలు నడుస్తున్నాయి. రమణదీక్షిలు చేసిన ఆరోపనలలో కీలకమైనది అవసరాల పేరుతో ఆలయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఇలానే కొనసాగితే బవిష్యత్ లో తిరుమల అనే ఒక ప్రాంతం ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినారు. చారిత్రక నిర్మాణాల విషయంలో పెరుగుతున్న బక్తుల అవసరాల కోసం కొన్ని మార్పులు అవసరం. అలాంటి విషయాలలో కొన్ని తప్పవు. అదే సందర్బంలో పేరు కోసం మార్పులు చేయాలన్న ప్రయత్నం ప్రమాదకరం. ఏది ఏమైనా తిరుమలలోని నిర్మాణాల విషయంలో మార్పులు చేర్పుల విదాన నిర్ణయం వ్యక్తుల చేతిలో కాకుండా వ్యవస్ద చేతిలో ఉండాలి. పురావస్తుశాకకు అప్పంగించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తిరుమలలో నిత్యం పూజాది కార్యక్రమాలు, పెరుగుతున్న బక్తుల అవసరాల నేపద్యంలో పురావస్తు పరిదిలోకి తిరుమల నిర్వహణ ప్రతిబందకం అవుతుంది. ఆపేరుతో వ్యక్తుల చేతిలోకి నిర్మాణాల వ్యవహరాన్ని ఉంచడం మంచిది కాదు. అందుకు పరిష్కారంగా దేవస్దానమే స్వంతంగా కేంద్ర పురావస్తు శాక మార్గదర్సకాలతో ఒక వ్యవస్దను ఏర్పాటు చేసుకోవడం దాని పరిదిలోకి నిర్మాణాల పర్యవేక్షణ బాద్యతను తీసుకురావడం ఉత్తమం.

అధికారులు- అర్చకులు- మిరాసీ…..

రమణదీక్షిలు చేసిన మరో ఆరోపన తిరుమల పూజాది కార్యక్రమాలు పద్దతిగా జరగడం లేదని. వారి విమర్సలో అధికారులు- అర్చకుల మద్య ఆదిపత్య వ్యవహరంగానే కనిపిస్తుంది. దైవం తర్వాత అంతటి గొప్ప స్దానం అర్చకుడిది. అంతటి స్దానంలో ఉన్న రమణదీక్షీల వ్యవహర శైలి ఆస్దాయికి తగిన విదంగా లేదు. అనేక సందర్బాలలో తిరుమలకు రిలయన్స్ అధినేతలు వచ్చినపుడు తానే వారి దగ్గరికి వెల్లి ఆశీర్వచనం ఇచ్చిన విషయం నేడు వారికి గుర్తులేకపోయిన శ్రీవారి బక్తులకు గుర్తు ఉంటుంది. అనేక సందర్బాలలో వారు గీతదాటిన విషయం మరిచిపోయి అధికారల తప్పులనే ప్రదానంగా చెప్పడం సముచితం కాదు. అర్చకులు తమ పరిధిని దాటినపుడు అధికారులు కూడా అలానే ఉంటారు. తిరుమల ఆలయంలో నిత్యం జరిగే పూజాది కార్యక్రమాలు ఆగమనియమాలకు అనుగునంగా జరుగుతుంది. అనేక సందర్బాలలో బక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పర్వదినాలలో శ్రీవారి పూజాది కార్యక్రమాల సమాయాన్ని కుదించడం, ఏకాంత సేవగా మార్చడం జరుగుతుంది. కొన్ని సందర్బాలలో సెలబ్రటీల కోసం కూడా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయన్నది దీక్షితుల విమర్స. శ్రీవారి పాలకమండలి, అధికారుల నియామకం సిపార్సుల మేరకు జరుగుతున్నపుడు వారు సెలబ్రటీల సేవలో కాకుండా బక్తుల సేవలో ఉంటారని ఆశించలేము. వారు పదే ,పదే లేవనెత్తుతున్నది మిరాసీ. స్వర్గీయ రామారావుగారి కాలంలో ఈ విదానాన్ని రద్దు చేసినారు. ఇది అత్యంత ప్రజాస్వామిక నిర్ణయం. ఆ విదానాన్ని మల్లీ తీసుకురావడం అనే దోరణిలో దీక్షితులు మాట్లాడటం అంగీకారం కాదు. ఏది ఏమైనప్పటికి రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ప్రతి విమర్సలు చేయడం లేదా తప్పించుకునే పద్దతిలో వ్యవహరించడం మంచిది కాదు. రమణదీక్షిలు వ్యవహరంలో తెర వెనక ఎవరు ఉన్నారన్న రాజకీయ కోనంలో కాకుండా వారు ప్రస్దావించిన అంశాలపై సమగ్ర చర్చ, అవసరం వాటిపై విచారణ దాని ఆదారంగా తగిన నిర్ణయాలు తీసుకునే వైపుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయాలి.

యం. పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*